Home » Crime
పటాన్‌చెరు మండలం రుద్రారం సమీపంలో క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు పాల్పడిన ముగ్గురు నిందితులను పటాన్‌చెరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు.
తిరుచానూరులో ఓ యువకుడు కత్తితో స్వైర విహారం చేశాడు. ఇద్దరిని పొడవగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఢిల్లీలో మరో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ బాలికపై ముగ్గురు మైనర్లు సహా నలుగురు సామూహిక హత్యాచారానికి పాల్పడ్డారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ హైప్రొఫైల్ కేసును పర్యవేక్షించే బాధ్యతలను సీబీఐ సీనియర్ ఆఫీసర్ సీమా పాహుజాకు అప్పగించారు.
ఓ మహిళ చిట్టీల పేరుతో కొందరిని నిలువునా మోసం చేసింది. వారి నుంచి సుమారు 20 కోట్ల రూపాయలు తీసుకుని పరారైంది.
కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్‌ను కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు సోమవారం విచారించారు. అయితే.. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అంతా సౌజన్యకే తెలుసని సాదిక్ చెప్పినట్టు తెలిసింది.
ఓ వ్యక్తి ఏటీఎమ్‌కు వెళ్లి, పిన్ ఎంటర్ చేసి డబ్బులు డ్రా చేశాడు. అయితే నగదు తీసుకున్నాక డెబిట్ కార్డ్ ఏటీఎమ్ లోపలే ఇరుక్కుపోయింది. దీంతో ఆ వ్యక్తి కంగారు పడ్డాడు. ఇదే అదునుగా సర్వం దోచేందుకు మోసగాళ్లకు ఈ కంగారు చాలు.
నాయుడుపేట పట్టణంలోని దుకాణాల్లో 200 రూపాయల దొంగనోట్లు కనిపించడంతో దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పవిత్రమైన గురు శిష్యుల బంధానికే మచ్చ తెచ్చేలా ఓ టీచర్ ప్రవర్తించింది. 17 ఏళ్ల విద్యార్థితో అఫైర్ పెట్టుకుని కటకటాల పాలైంది.
హైదరాబాద్‌లో పాన్‌షాప్ ముసుగులో గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 5 వేలకుపైగా గంజాయి చాక్లెట్ల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.