Home » Chittoor
Gangamma Jatara: చిత్తూరు నగరంలోని బజారువీధిలో మంగళ, బుధవారాల్లో నిర్వహించే నడివీధి గంగమ్మ జాతరకు సర్వం సిద్ధం చేసినట్లు వంశపారంపర్య ధర్మకర్తలు సీకే బాబు, హేమంత్‌కుమార్ వెల్లడించారు. మంగళవారం వేకువ జాము నాలుగు గంటలకు ధర్మకర్త సీకేబాబు దంపతులు అమ్మవారికి తొలిపూజ చేసి, అంబలి నైవేద్యం సమర్పించారు.
Road Accident: పౌర్ణమి నేపథ్యంలో తిరువన్నామలైకు ఆర్టీసీ డిపో ఎక్కువ బస్సులను నడుపుతోంది. ఒక రోజు ముందే వెళితే గిరి ప్రదర్శన చేసుకునే అవకాశం ఉంటుందని భక్తులు తిరుపతి నుంచి ఎక్కువగా వెళుతుంటారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో తిరువన్నామలై నుంచి తిరుపతికి వస్తున్న క్రమంలో చంద్రగిరి మండలం, అగరాల సమీపంలో బస్సు కల్వర్టును ఢీ కొట్టింది.
విద్యాశాఖలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రాతిపదికన త్వరలోనే పెద్దఎత్తున బదిలీలు, పదోన్నతులు జరగనున్నాయి.
ఏటా లక్షమంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని సీఎం చంద్రబాబు ఇదివరకే హామీ ఇచ్చారు. అందులో భాగంగానే మెప్మా ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు నిర్వహించేలా తృప్తి క్యాంటీన్లను ప్రవేశపెట్టారు.
ఏటా వైశాఖ మాసంలో చిత్తూరులో నిర్వహించే నడి వీధి గంగమ్మ జాతరకు తరాల చరిత్ర వుంది.భక్తులు ఎంతో నిష్టతో అమ్మవారికి పొంగళ్ళు పొంగించి అంబలిని నైవేద్యంగా సమర్పిస్తారు.జాతర చాటింపు వేశాక దూర ప్రాంతాలకు వెళ్లడం మానేస్తారు.
Minister Lokesh: మంత్రి లోకేష్ కృషితో ఏపీకి మరో భారీ పెట్టుబడి వచ్చింది. గురువారం నాడు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి భూమి పూజ చేశారు. దీంతో నిరుద్యోగులకు భారీగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.
టెర్రరిజాన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని.. నక్సలిజం అంతంపై పెట్టిన దృష్టిలో పదో శాతం టెర్రరిజంపై పెట్టాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. చనిపోయిన మృతులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నామన్నారు. ఉగ్రవాదాన్ని భూస్థాపితం చేయాలని, టెర్రరిజంపై వ్యతిరేకంగా ఉన్న వారిని ఐక్యం చేయాలని సూచించారు.
తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాల కొత్త షెడ్యూల్ గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. ప్రోటోకాల్, రిఫరల్, బ్రేక్ దర్శనాలను ఉదయం 7.30 గంటల లోపు పూర్తి చేసి, సామాన్యులకు అదనంగా దర్శన సమయం కల్పించనున్నారు.
Tirupati Case: తిరుపతిలో ఇటీవల జరిగిన వృద్ధురాలు శాంతమ్మ మృతిని పక్కా హత్యగా పోలీసులు నిర్ధారించారు. సంపద కోసమే వృద్ధురాలిని హత్య చేసినట్లు గుర్తించారు.
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా ముగిసింది. శాసనసభ్యుల్లో జీడీనెల్లూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు థామ్‌స,ఎమ్మెల్యే మురళీమోహన్ మాత్రమే పాల్గొన్నారు.