TDP Leader: టీడీపీ నేత ఇంట్లో భారీ దొంగతనం..
ABN , Publish Date - Jun 26 , 2025 | 06:19 PM
TDP Leader: టీడీపీ నేత గార్లపాటి ప్రకాష్ రావు బుధవారం భార్యతో కలిసి షిరిడి యాత్రకు వెళ్లారు. ప్రకాష్ రావు ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న దొంగలు చోరీకి ప్లాన్ చేశారు. అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత తలుపులు పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు.

ఓ టీడీపీ నేత ఇంట్లో భారీ చోరీ జరిగింది. దొంగలు పక్కా ప్లాన్‌తో ఇంటిని దోచేశారు. కోటి రూపాయల విలువ చేసే సొత్తు ఎత్తుకెళ్లిపోయారు. సదరు టీడీపీ నేత కుటుంబం షిరిడి యాత్రలో ఉండగా ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండలం ఆరె గ్రామానికి చెందిన టీడీపీ నేత గార్లపాటి ప్రకాష్ రావు బుధవారం భార్యతో కలిసి షిరిడి యాత్రకు వెళ్లారు. ప్రకాష్ రావు ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న దొంగలు చోరీకి ప్లాన్ చేశారు.
అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత తలుపులు పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువా లాకర్‌లో ఉన్న 120 సవర్ల గోల్డ్, ఐదు కేజీల వెండి, 10 లక్షల రూపాయల డబ్బు ఎత్తు కెళ్లారు. ప్రకాష్ అన్న యుగంధర్ నాయుడు.. ప్రకాష్ ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించారు. తమ్ముడు ప్రకాష్‌తో పాటు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న నారాయణవనం రూరల్ సీఐ రవీంద్ర, కేవీబీపురం మండల ఎస్సై నరేష్.. ప్రకాష్ రావు ఇంటి దగ్గరకు చేరుకున్నారు.
చిత్తూరు నుంచి క్లూస్ టీం వచ్చింది. ఆధారాలు సేకరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక, ఇంట్లో చోరీ జరిగిందని తెలియటంతో.. ప్రకాష్ రావు దంపతులు షిరిడీ పర్యటనను రద్దు చేసుకున్నారు. వెనక్కు తిరుగు ప్రయాణం అయ్యారు.
ఇవి కూడా చదవండి
కుబేర సినిమా చూస్తుండగా కూలిన థియేటర్ సీలింగ్
ఆహా.. ఇలాంటి పేదరికం అందరికీ కావాలి.. ఈ గుడిసెను చూస్తే నివ్వెరపోవాల్సిందే..