Share News

Viral Video: ఆహా.. ఇలాంటి పేదరికం అందరికీ కావాలి.. ఈ గుడిసెను చూస్తే నివ్వెరపోవాల్సిందే..

ABN , Publish Date - Jun 26 , 2025 | 03:41 PM

సాధారణంగా మన దేశంలో పేద వాళ్లు ఖాళీ స్థలంలో లేదా స్లమ్ ఏరియాల్లో గుడిసెలు వేసుకుని కనీస సౌకర్యాలు కూడా లేకుండా బతుకుతారు. తినడానికి ఆహారం సంపాదించుకోవడానికే ఎంతో కష్టపడతారు. వారు ఇతర సౌకర్యాల కోసం కనీసం కలలో కూడా ఊహించుకోరు.

Viral Video: ఆహా.. ఇలాంటి పేదరికం అందరికీ కావాలి.. ఈ గుడిసెను చూస్తే నివ్వెరపోవాల్సిందే..
Viral Video

సాధారణంగా మన దేశంలో పేద వాళ్లు (Poor) ఖాళీ స్థలంలో లేదా స్లమ్ ఏరియాల్లో గుడిసెలు వేసుకుని కనీస సౌకర్యాలు కూడా లేకుండా బతుకుతారు. తినడానికి ఆహారం సంపాదించుకోవడానికే ఎంతో కష్టపడతారు. వారు ఇతర సౌకర్యాలను కనీసం కలలో కూడా ఊహించుకోరు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే నివ్వెరపోవాల్సిందే. ఆ వీడియో చూసి.. అలాంటి పేద బతుకు కావాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఆ వీడియో నెట్టింట హల్‌‌చల్ చేస్తోంది.


theindiancasm అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. రోడ్డు పక్కన చెట్ల మధ్యలో చిన్న టెంట్ (Hut) ఉంది. అయితే ఆ టెంట్ బయట ఏసీ అవుట్ డోర్ యూనిట్ కనబడుతోంది. ఆ గుడిసె లోపలికి వెళ్లి చూస్తే షాకవ్వాల్సిందే. ఎందుకంటే లోపల ఏసీ బిగించి ఉంది. అలాగే మినీ ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఓ వ్యక్తి బెడ్ మీద హాయిగా పడుకుని ఎల్‌ఈడీ టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 50 లక్షల మంది వీక్షించారు. 4.7 లక్షల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. ఇది వీఐపీ టెంట్ అని ఒకరు ఫన్నీగా కామెంట్ చేశారు. నేను కూడా ఇలాంటి పేద బతుకును కోరుకుంటున్నా అని మరొకరు పేర్కొన్నారు. ఈ ప్రపంచంలో పేదరికం అనేది ఇంత అందంగా మారిపోతే ఎంత బాగుంటుంది అని ఇంకొకరు కామంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

మీ కళ్లకు పవర్‌ ఉంటే.. జిరాఫీల మధ్యనున్న పామును 5 సెకెన్లలో కనిపెట్టండి

వామ్మో.. నూడిల్స్ తింటే ఇంత ప్రమాదమా.. నూడిల్స్ ప్యాకెట్ మీద ఏం రాసి ఉందంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 26 , 2025 | 05:43 PM