Polycet: నేటినుంచి పాలిసెట్ కౌన్సెలింగ్
ABN , Publish Date - Jun 21 , 2025 | 01:23 AM
నేటినుంచి 28వ తేది వరకు పాలిసెట్ వెబ్ కౌన్సెలింగ్ జరగనుంది. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులలో ప్రవేశం పొందేందుకు పాలిసెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ఈ వెబ్ కౌన్సెలింగ్‌కు ర్యాంకుల వారీగా హాజరు కావాలి.
చిత్తూరు (విద్య), జూన్ 20 (ఆంధ్రజ్యోతి): నేటినుంచి 28వ తేది వరకు పాలిసెట్ వెబ్ కౌన్సెలింగ్ జరగనుంది. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులలో ప్రవేశం పొందేందుకు పాలిసెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ఈ వెబ్ కౌన్సెలింగ్‌కు ర్యాంకుల వారీగా హాజరు కావాలి. తొలి రోజైన శనివారం 1 నుంచి 15,000వ ర్యాంకు వరకు వెబ్ కౌన్సెలింగ్ జరగనుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్, సత్యవేడు పాలిటెక్నిక్, పలమనేరులో వుమెన్స్ పాలిటెక్నిక్, మదనపల్లెలోని మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్‌లలో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ సెంటర్లలో ఎక్కడైనా విద్యార్థులు ర్యాంకుల వారీగా హాజరై తమ సర్టిఫికెట్లను వెరిఫై చేయించుకోవచ్చు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే జనరల్ అభ్యర్థులు రూ.700, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు రూ.240 ప్రాసెసింగ్ రుసుం చెల్లించి రసీదును ప్రింట్ తీసుకోవాలి. రసీదుతోపాటు పాలిసెట్ హాల్‌టికెట్, ర్యాంక్ కార్డు, ఎస్సెస్సీ మార్కులలిస్టు ఒరిజినల్ లేదా ఇంటర్నెట్ కాపీ, 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, 2025-26 ఇన్‌కం సర్టిఫికెట్, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు క్యాస్ట్ సర్టిఫికెట్లు తీసుకోవాలి. ఒరిజినల్‌తోపాటు రెండు సెట్లు జిరాక్స్ కాపీ సెట్లతో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి. పీడబ్ల్యుడీ, క్యాప్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ స్పెషల్ కేటగిరీ అభ్యర్థులు విజయవాడలో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. ఇతర సందేహాలకు సమీపంలోని పాలిటెక్నిక్‌ల్లోని హెల్ప్‌లైన్ సెంటర్లలోగాని లేదా పాలిసెట్ కౌన్సెలింగ్ ఇంచార్జిని 94925 26080 నెంబరులో గాని సంప్రదించవచ్చు.
ర్యాంకుల వారీగా కౌన్సెలింగ్ తేదీలు
21వ తేదీ - 1 ర్యాంకు నుంచి 15,000
22వ తేదీ - 15001 నుంచి 32,000
23వ తేదీ - 32001 నుంచి 50,000
24వ తేదీ - 50001 నుంచి 68000
25వ తేదీ - 68001 నుంచి 86,000
26వ తేదీ - 86001 నుంచి 104000
27వ తేదీ- 104001 నుంచి 120000
28వ తేదీ - 120001 నుంచి చివరి ర్యాంకు వరకు