Home » China
ఎస్‌సీఓ సదస్సుకు చైనా ఇటీవల ఆతిథ్యం ఇచ్చింది. పది సభ్యదేశాలు, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రెస్ సహా 20 ఆహ్వానిత నేతలు ఒకే వేదిక మీదకు వచ్చారు.
అమెరికాకు సవాల్ విసిరేందుకు, తాను ఓ సూపర్ పవర్ అని చెప్పేందుకు తహతహలాడుతోంది చైనా. ఈ భూమండలంపై ఏ ప్రాంతం పైన అయినా తాము దాడి చేయగలమని చెప్పేందుకు ప్రయత్నించింది. బీజింగ్‌లో తన అత్యాధునిక ఆయుధ సంపత్తిని ప్రదర్శించింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్, చైనాలకు అండగా నిలిచారు. ఇరు దేశాలపై అమెరికా అవలంబిస్తున్న ట్రేడ్ టారిఫ్స్‌ను పుతిన్ తీవ్రంగా ఖండించారు. కాలం చెల్లిన వలసవాద మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని..
పుతిన్ కూడా ఇలాంటి ప్రోటోకాల్‌నే ఫాలో అవుతున్నారు. పుతిన్ డీఎన్ఏను ఎవరూ దొంగలించకుండా ఉండేందుకు.. ఆయన ఎక్కడికి వెళ్లినా మూత్రాన్ని, మలాన్ని సేకరిస్తున్నారు.
షాంఘై సహకార సంస్థ టియాంజిన్ ప్రకటనను కాంగ్రెస్ ఎంపీ చిదంబరం ఒక 'చెత్త' అన్నారు. ఈ డిక్లరేషన్ ఉగ్రవాదాన్ని, దాని అన్ని రూపాల్ని తీవ్రంగా ఖండించింది.. దానిపై పాకిస్తాన్ సంతకం చేసి ఆమోదించింది. అది ఆ ప్రకటన విలువను చూపిస్తుందని..
చైనా పర్యటన కోసం ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ సోమవారం సాయంత్రం ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ రైల్లో బయలుదేరారు. నేటి సాయంత్రం ఆయన చైనాకు చేరుకోనున్నారు. అక్కడి మిలిటరీ పరేడ్‌ను పుతిన్, జిన్‌పింగ్‌తో కలిసి వీక్షించనున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరిగిన భేటీ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో చైనా విషయంలో భారత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మన దేశం నుంచి చైనాకు గతంలో ఎక్కువగా బట్టలు, రసాయనాలు, లోహాలు వంటివి ఎగుమతి అయ్యేవి. కానీ ప్రస్తుతం సీన్ మారింది. ఇప్పుడు మన ఆహార, వ్యవసాయ ఉత్పత్తులు చైనా మార్కెట్లో హవా చేయనున్నాయి.
ఎస్‌సీఓలో భారతదేశం కీలక భూమిక పోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఎస్‌సీఓకు కొత్త నిర్వచనం చెప్పారు. ఎస్ అంటే సెక్యూరిటీ, సీ అంటే కనెక్టివిటీ, ఓ అంటే ఆపర్చునిటీ అని తెలిపారు. భద్రత, అనుసంధానం, అవకాశం అని చెప్పారు.
న్యాయమైన, సహేతుకమైన ప్రపంచ పాలన వ్యవస్థను నిర్మించడాన్ని అందరూ కృషి చేయాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తెలిపారు. సభ్య దేశాలు SCO సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడం, వనరుల ఇన్‌పుట్, సామర్థ్య నిర్మాణాన్ని పెంచడం, నిర్ణయాలు మరింత శాస్త్రీయంగా తీసుకోవడంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.