China Aircraft Shelters: చైనా కుతంత్రం.. భారత బోర్డర్ చుట్టూ 36 ఆయుధశాలల నిర్మాణం
ABN , Publish Date - Oct 28 , 2025 | 07:57 AM
భారతదేశానికి దాయాది దేశం చైనా తాజాగా మరో తలనొప్పి తెచ్చింది. సరిహద్దు రాష్ట్రమైన మన అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ కు సమీపంలో చైనా ఏకంగా 36 ఎయిర్‌క్రాఫ్ట్ షెల్టర్లు గుట్టుచప్పుడు కాకుండా నిర్మించేసింది. శరవేగంతో భారత్ పై దాడి చేసే..
ఇంటర్నెట్ డెస్క్: భారతదేశానికి దాయాది దేశం చైనా తాజాగా మరో తలనొప్పి తెచ్చింది. సరిహద్దు రాష్ట్రమైన మన అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ కు సమీపంలో చైనా ఏకంగా 36 ఎయిర్‌క్రాఫ్ట్ షెల్టర్లు గుట్టుచప్పుడు కాకుండా నిర్మించేసింది. భారత్-చైనా సరిహద్దు అయిన మెక్‌మహాన్ లైన్‌కు అతి సమీపంలో ఎయిర్‌క్రాఫ్ట్ షెల్టర్లు, కొత్త అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లు, కొత్త స్థావరాల నిర్మాణాన్ని చైనా పూర్తి చేసింది.

అరుణాచల్ ప్రదేశ్‌లోని వ్యూహాత్మక పట్టణమైన తవాంగ్ నుండి దాదాపు 107 కిలోమీటర్ల దూరంలో ఉన్న లుంజ్ వద్ద నుంచి భారత బోర్డర్ పొడవునా చైనా ఈ నిర్మాణాలు చేసింది. ఈ బోర్డర్ షెల్టర్లు చైనాకు భారత్ పైకి యుద్ధ విమానాలను, అనేక డ్రోన్ వ్యవస్థలను అత్యంత తక్కువ వ్యవధిలో దాడిచేసే అవకాశాన్ని ఇస్తాయి. అదే సమయంలో భారత్ కు పొరుగుదేశం నుంచి వచ్చిన ముప్పును గమనించి ప్రతిదాడి చేసేందుకు సమయం బాగా తగ్గిపోతుంది. మన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ఎయిర్ బేస్ నుంచి రియాక్ట్ అయ్యేందుకు ఇప్పటి వరకూ ఉన్న సమయం చాలా తగ్గిపోతుంది.

ఈ తాజా చైనా దేశపు నిర్మాణాలు భారత సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. ఉపగ్రహ చిత్రాలు, ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా తెలుస్తున్న సమాచారం ఏంటంటే.. ఈ షెల్టర్లు ఆయుధశాలలు భారీ బాంబర్లు, ఫైటర్ జెట్లను మోహరించే సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఇవన్నీ.. భారత్‌కు సమీపంలోని లాసా లేదా ఇతర చైనా దేశపు ఎయిర్‌బేస్‌లకు అదనపు బలాన్నిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారత్-చైనా మధ్య డోక్లాం, గల్వాన్ ఘటనల తర్వాత సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో చైనా తాజా చర్యలు మరింత ఆందోళన కలిగిస్తోంది. భారత వైమానిక దళం కూడా సరిహద్దు ప్రాంతాల్లో తన సన్నద్ధతను పెంచుకోవాల్సిన పరిస్థితులు కలుగుతున్నాయి. ఈ నిర్మాణాలు ప్రాంతీయ భద్రతకు కొత్త సవాళ్లను తెస్తున్నాయని, దీనిపై దౌత్యపరమైన చర్చలు అవసరమని విశ్లేషకులు సూచిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
జూబ్లీహిల్స్‌లో బీజేపీ-మజ్లిస్ మధ్యే పోటీ
Read Latest Telangana News and National News