Home » Chandrababu naidu
ఏపీలో ఎన్నికల కొలాహలం మొదలైంది. ప్రధాన పార్టీల మధ్య రసవత్తర రాజకీయం నడుస్తోంది. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) వరుసగా సభల్లో పాల్గొంటూ ఆ పార్టీ క్యాడర్‌కు ఉత్సాహాన్ని నింపుతున్నారు.
రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేసే విషయంపై మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్(Jaleel Khan) కీలక వ్యాఖ్యలు చేశారు. మైనార్టీలు అందరూ తనకు సీటు ఇవ్వాలని కోరుతున్నారని చెప్పారు.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తుడడంతో టీడీపీ(TDP), వైసీపీ(YSRCP) నేతల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ రణరంగాన్ని తలపిస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి వైసీపీ పాలనను బొందపెడతారని పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర(Dhulipalla Narendra) హెచ్చరించారు.
ఆంధ్ర రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని, నాశనమైన ఈ రాష్ట్రాన్ని ఐదేళ్లలో ట్రాక్‌లో పెట్టే బాధ్యత తనదేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 2029 నాటికి భారతదేశంలో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టాలన్నదే తన సంకల్పమని చెప్పారు. పేదరికం లేని సమాజమే తన ఆశయమని.. అందుకు తనకు సహకరించాలని కోరారు.
కర్నూలు జిల్లాలోని పత్తికొండలో నిర్వహించిన ‘రా కదలిరా’ కార్యక్రమం బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్‌కు సబ్జెక్టు ఏమీ లేదని, బిల్డప్పులు మాత్రమే ఇస్తున్నారంటూ దుయ్యబట్టారు. కర్నూలు జిల్లా అభివృద్ధి టీడీపీ, జనసేన పొత్తుతోనే సాధ్యమని ఉద్ఘాటించారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రా.. కదలిరా కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. నెల్లూరు ఎజ్వీజీఎస్ కాలేజీ గ్రౌండ్స్‌కు భారీగా జనం తరలి వచ్చారు.
టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని సీఎం జగన్(CM Jagan) వ్యాఖ్యానించారు. శనివారం నాడు సిద్ధం పేరుతో ఉత్తరాంధ్ర కార్యకర్తల నేతల సమావేశం నిర్వహించారు.
తిరుపతిలోని పీలేరులో ‘రా.. కదలిరా’ పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క మంచి మంత్రి కూడా లేడని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. పదవుల కోసం సొంత కార్యకర్తల నుంచే లంచం తీసుకుంటున్న మంత్రి ఒకడు ఉన్నాడని, అతడే పెద్దిరెడ్డి అని ఆరోపణలు చేశారు.
వైసీపీకి మరో సీనియర్ ఎమ్మెల్యే రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పెనమలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పార్థసారధి రాజీనామాకు సిద్ధం అయినట్లు సమాచారం.