Chandrababu: దేశానికి అమరావతి తెలియాలనే
ABN , Publish Date - May 04 , 2025 | 05:31 AM
అమరావతి పునఃప్రారంభాన్ని దేశానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ చేతుల మీదుగా సభ నిర్వహించామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు
ప్రధానితో రాజధానిలో సభ జరిపాం
కార్యక్రమాన్ని బాగా నిర్వహించారు
నేతలు, అధికారులకు సీఎం అభినందన
అమరావతి మే 3 (ఆంధ్రజ్యోతి): అమరావతి ఆవశ్యకతను దేశప్రజలందరికీ వివరించేందుకు అమరావతి పనుల పునఃప్రారంభాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిపించామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. శనివారం కూట మి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతి పునఃప్రారంభ సభ విజయవంతమైందని చంద్రబాబు అన్నారు. సభ నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందని ప్రశంసించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ సమన్వయంతో పనిచేశారని అభినందించారు.
‘‘అమరావతి ఒక నగరం కాదని, ఒక శక్తిగా మారుతుందన్న ప్రధాని మాటలు స్ఫూర్తిని నింపాయి. రాష్ట్ర వృద్ధిరేటుకు అమరావతి కేంద్రంగా ఉంటుందని ప్రధాని చేసిన వ్యాఖ్యలు భవిష్యత్ రాజధానిని ఆవిష్కరించాయి. అమరావతికి ప్రధాని భరోసా ఇచ్చారు. దేశానికి అమరావతి రోల్‌మోడల్‌గా రూపొందుతుందని ప్రధాని అనడం రాష్ట్రానికి గర్వకారణం. ప్రధాని ప్రసంగం రాష్ట్ర ప్రజల పట్ల ఆయనకు ఉన్న అభిమానానికి, రాష్ట్రాభివృద్ధిపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.’’ అని చంద్రబాబు తెలిపారు. కాగా, అమరావతి పునఃప్రారంభ సభపై అన్నివర్గాల ప్రజల్లో సానుకూలత వ్యక్తమైందని మంత్రులు పార్థసారథి, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. మూడేళ్లలో నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాల్సిన బాధ్యత మంత్రి నారాయణపై ఉందని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి
Goa Temple Stampede: గోవాలోని శ్రీ లరాయ్ దేవీ దేవాలయం యాత్రలో తొక్కిసలాట.. 7 దుర్మరణం
Nara Lokesh: అమరావతి అన్‌స్టాపబుల్
Read Latest AP News And Telugu News