Chandrababu Approves: విద్యుత్తు సంస్థల డైరెక్టర్ల నియామకానికి గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - May 04 , 2025 | 04:58 AM
విద్యుత్తు సంస్థల్లో డైరెక్టర్ల నియామకానికి సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీనితో, సీపీడీసీఎల్‌కి పుల్లారెడ్డిని కొత్త సీఎండీగా నియమించారు
అమరావతి, మే 3(ఆంధ్రజ్యోతి): విద్యుత్తు సంస్థల్లో డైరెక్టర్ల నియామకానికి సీఎం చంద్రబాబు శనివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఫైలు ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు.. ఆ వెంటనే ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌కు చేరింది. ముఖ్యమంత్రి ఆమోదం పొందడంతో త్వరలోనే నియామక ఉత్తర్వులు వెంటనే విడుదలయ్యే వీలుందని ఇంధనశాఖ వర్గాలు తెలిపాయి. కాగా, సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (సీపీడీసీఎల్) ఇన్‌చార్జి సీఎండీ భాస్కర్ స్థానంలో సీఎండీగా పుల్లారెడ్డిని నియమించారు.