Home » Budget 2025
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మళ్లీ మొండిచెయ్యే ఎదురైంది. హైదరాబాద్ చుట్టుపక్కల చేపట్టనున్న ప్రాజెక్టులు.. రాష్ట్రానికి సంబంధించిన ప్రాఽధాన్యమైన ప్రాజెక్టులకు నిధులు, అనుమతుల మంజూరు కోరుతూ ప్రభుత్వం పలు ప్రతిపాదనలు చేసినా దేనికీ నిధులివ్వలేదు.
‘యూపీఏ హయాంలో హైదరాబాద్‌కు ఐఐటీ, మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్), ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు వచ్చాయి. బాసరకు ట్రిపుల్ ఐటీ వచ్చింది.
రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు కేటాయింపులు చేసింది. విశాఖ ఉక్కుకి కూడా నిధులు సమకూర్చింది.
Minister Savitha: సీఎం చంద్రబాబు కృషి ఫలితంగానే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అధిక నిధులు కేటాయించారని మంత్రి సవిత తెలిపారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచేలా, యువతకు ఉపాధి అవకాశాలు అందించేలా కేంద్ర బడ్జెట్ ఉందని మంత్రి సవిత పేర్కొన్నారు.
Congress: 2025-26 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ ఆదివారం నాడు ధర్నాకు పిలుపునిచ్చింది.
Pawan Kalyan: రైతులు, మహిళలు, మధ్యతరగతి, యువత... ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇస్తున్న అండదండలు కేంద్ర బడ్జెట్‌లోనూ కొనసాగిందని చెప్పారు.
వరసగా 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలమ్మ ఈ సారి కూడా ప్రత్యేకమైన చీర ధరించారు. బడ్జెట్ సమర్పించేటప్పుడు నిర్మలమ్మ చెప్పే విషయాలతో పాటు ఆమె కట్టిన చీర కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది..
Budget 2025-26 Full Details: ఈసారి మధ్యతరగతి, వేతన జీవులే లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించింది. రైతులు, వ్యాపారులకు ప్రోత్సాహకం అందిస్తూనే.. ట్యాక్స్ మినహాయింపులతో ఉద్యోగులకూ శుభవార్త చెప్పింది. బడ్జెట్-2025లో స్పెషాలిటీస్ ఏంటీ, సమగ్ర బడ్జెట్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Etela Rajender: దేశాన్ని గ్రీన్ ఎనర్జీ, సోలార్, విండ్ ఎనర్జీ దిశగా తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణలో బొగ్గు విద్యుత్ ఉన్న ప్రాంతాలు అన్ని బొందల గడ్డలుగా మారాయని విమర్శించారు. కొన్ని మందులపై ట్యాక్స్ లేకుండా కేంద్రం నిర్ణయం తీసుకుందని ఎంపీ ఈటల రాజేందర్ చెప్పారు.
Minister Sridhar Babu: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ ప్రస్తావన లేదని మండిపడ్డారు. తెలంగాణలో రైల్వే కనెక్టివిటీని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరినా పట్టించుదని చెప్పారు. గిరిజన యూనివర్సిటీకి మద్దతు ఇవ్వలేదని మండిపడ్డారు. గోదావరి-మూసీ అనుసంధానం ప్రస్తావనే లేదని చెప్పారు.