Jaggareddy: యూపీఏ హయాంలోనే హైదరాబాద్‌కు ఐఐటీ, మెట్రో, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు
ABN , Publish Date - Feb 02 , 2025 | 03:25 AM
‘యూపీఏ హయాంలో హైదరాబాద్‌కు ఐఐటీ, మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్), ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు వచ్చాయి. బాసరకు ట్రిపుల్ ఐటీ వచ్చింది.
ఆనాడే ఓఆర్‌ఆర్, బాసర ట్రిపుల్ ఐటీ వచ్చింది.. ఇదీ తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ చరిత్ర
రాష్ట్ర బీజేపీ ఎంపీలారా.. మీరేం తెచ్చారో చెప్పండి?
నిర్మలా సీతారామన్.. పేరుకే తెలుగింటి కోడలు
తెలంగాణకు రూపాయి ఇచ్చింది లేదు..
బండి సంజయ్, కిషన్‌రెడ్డి ఇక్కడ మాటలు నరుకుతరు
ప్రధాని మోదీ దగ్గరకెళ్లి తోక ఊపుతూ కూర్చుంటరు
నిధుల కోసం సీఎం రేవంత్ పలుమార్లు దరఖాస్తు
అయినా కేటాయింపుల్లేవ్.. ఇది నిరాశాజనక బడ్జెట్
టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): ‘యూపీఏ హయాంలో హైదరాబాద్‌కు ఐఐటీ, మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్), ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు వచ్చాయి. బాసరకు ట్రిపుల్ ఐటీ వచ్చింది. సోనియా, మన్మోహన్‌సింగ్, రాహుల్ గాంధీల నాయకత్వంలో హైదరాబాద్‌కు మౌలిక వసతులు కల్పించడంతో ఆదాయం పెరిగి రాష్ట్ర బడ్జెట్ రూ.3 లక్షల కోట్లకు ఎదిగింది. ఇదీ తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ పార్టీ చరిత్ర..! బీజేపీ తెలంగాణ ఎంపీలారా..? ఈ గడ్డపై మీ పార్టీకున్న చరిత్ర ఏంటో చెప్పండి..?’ అంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి నిలదీశారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ఏటా రూ.లక్ష కోట్ల దాకా పన్నులు కడుతున్నారని, అయినా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన రూ.50 లక్షల కోట్ల బడ్జెట్‌లో తెలంగాణకు ప్రత్యేకంగా కేటాయించింది ఏమీ లేదని మండిపడ్డారు. ఈ గడ్డపై నుంచి ఎన్నికై.. కేంద్రమంత్రులైన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు.. దీనికేం సమాధానం చెబుతారంటూ జగ్గారెడ్డి నిలదీశారు.
తెలంగాణ గడ్డపై నుంచి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు పెద్ద పెద్ద మాటలు నరుకుతుంటారని, ప్రధాని మోదీ వద్దకు వెళ్లగానే తోక ఊపుతూ ఆయన దగ్గర కూర్చుంటారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీతో వారు మాట్లాడి తెలంగాణకు ప్రత్యేకంగా నిధులు కేటాయింపు చేస్తే బాగుండేదన్నారు. తెలంగాణకు ఐటీఐఆర్ ఇవ్వాలన్న డిమాండు ఎప్పట్నుంచో ఉందని, దీనిపై కేంద్రాన్ని ఎందుకు ఒప్పించలేకపోయారని ప్రశ్నించారు. నిర్మలా సీతారామన్ పేరుకే తెలుగింటి కోడలని, తెలంగాణకు ఆమె ప్రత్యేకంగా కేటాయించింది ఏమీ లేదని విమర్శించారు. రాష్ట్రాన్ని కేసీఆర్.. అప్పుల పాలు చేసిన నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసి వివిధ కార్యక్రమాలకు నిధులు కేటాయించి రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారని గుర్తు చేశారు. అయినా బడ్జెట్‌లో కేటాయింపులు జరపకపోవడం బాధాకరమని అన్నారు. ఇది దేశ బడ్జెట్‌లాగా లేదని, బిహార్ ఎన్నికల బడ్జెట్‌లాగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వాటాగా వచ్చే నిధులు తప్ప తెలంగాణకు ప్రత్యేకంగా కేటాయించింది ఏమీ లేదని చెప్పారు.
ఇవీ చదవండి:
సచిన్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం.. ఈ అవార్డు చాలా స్పెషల్
ఒకే రోజు ముగ్గురు స్టార్ల సెంచరీలు మిస్.. ఇది ఊహించలేదు
చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్‌కు బిగ్ షాక్.. అసలైనోడు దూరం
మరిన్ని తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి