Home » Buddha Venkanna
జోగి రమేష్ కీలక పాత్ర ఉందని జనార్ధన్ స్వయంగా ప్రకటించారని.. తప్పు చేసి దొరికిపోయి కూడా జోగి రమేష్ సిగ్గు లేకుండా వాగుతున్నారని బుద్దా వెంకన్న మండిపడ్డారు. కల్తీ మద్యంతో సంబంధం లేని చంద్రబాబు ఎందుకు ప్రమాణం చేయాలని ప్రశ్నించారు.
టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు పచ్చి మోసగాళ్ళని, కాబట్టే ప్రజలు వారిని 11 సీట్లకే పరిమితం చేశారని విమర్శలు గుప్పించారు.
రాష్ట్ర అభివృద్ధి సీఎం చంద్రబాబుకే సాధ్యమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు...
టీడీపీ బుద్దా వెంకన్న, పేర్ని నాని పై కఠిన విమర్శలు చేశారు. వంశీని స్వాతంత్య్ర సమరయోధుడిగా పోల్చినందుకు పేరు నాని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Buddha Venkanna: తెలుగు దేశం సీనియర్ నేత బుద్దా వెంకన్న.. వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వంగవీటి మోహన రంగా పేద ప్రజల కోసం పాటు పడిన మహనీయుడని, అటువంటి గొప్ప వ్యక్తితో వంశీకి పోలికా.. అంటూ మండిపడ్డారు.
Buddha Venkanna: మాజీ ఎంపీ కేశినేని నానిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రావెల్స్ పేరుతో కార్మికులను మోసం చేశావని బుద్దా వెంకన్న ఆరోపించారు.
సీఎం చంద్రబాబు విజన్ 2020 అంటే అందరూ నవ్వారని.. ఫలితాలు చూసి ఆశ్చర్యపోయారని టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. దేశ ఆర్ధిక పరిస్థితి కంప్యూటర్‌పైన ఉందంటే వాటిని పరిచయం చేసిన చంద్రబాబే కారణమని అన్నారు. స్వర్ఞాంధ్రప్రదేశ్ 2047లో భాగంగా పి4 కార్యక్రమం ప్రారంభించారని... పేదలు ఆర్ధికంగా ఎదగాలనే సంకల్పంతో చంద్రబాబు పని చేస్తున్నారని అన్నారు.
Buddha Venkanna: గత జగన్ ప్రభుత్వంలో వేలకోట్ల రూపాయల మద్యం కుంభకోణం చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. నేషనల్ క్రైం రికార్డు ప్రకారం వైసీపీ హయాంలో మద్యం ద్వారా వందశాతం మరణాలు సంభవించాయని రిపోర్డు ఇచ్చిందని బుద్దా వెంకన్న గుర్తుచేశారు.
Buddha warn to KTR: మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏపీ టీడీపీ నేత బుద్దా వెంకన్న స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నోటి దూలతో ప్రభుత్వం పోయిందని.. ఇలాగే ఉంటే సిరిసిల్లలో కూడా గెలవరంటూ హెచ్చరించారు.
విజయవాడలో ఆయన మాట్లాడుతూ జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించి జగన్ చరిత్ర హీనుడయ్యాడన్నారు.