Home » bomb blasts
ఢిల్లీ ఎర్రకోట, అసెంబ్లీ, పలు పాఠశాలలకు వచ్చిన బాంబు బెదిరింపులు దేశ రాజధానిలో కలకలం రేపాయి. అయితే పోలీసులు వెంటనే స్పందించి తనిఖీలు నిర్వహించడంతో ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పాకిస్థాన్‌లో మరో పెద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు భద్రతా సిబ్బంది సహా పౌరులూ మరణించినట్టు సమాచారం. వారిలో ఓ లెఫ్టినెంట్ కల్నల్ స్థాయి అధికారి కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు పెరిగిపోతున్నాయి. తాజాగా మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. గల్ఫ్ ఎయిర్‌లైన్స్ విమానానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. వెంటనే ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తం అయ్యారు.
కామారెడ్డిలో బాంబులు కలకలం సృష్టించాయి. ఓ రైతు పొలంలో జరిగిన ఈ ఘటనలో ఓ శునకం మరణించింది.
ఉగ్రవాది సాజిద్‌కు హైదరాబాద్‌తో లింకులేంటి.. అన్నదానిపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా సాజిద్ సంబంధీకులను పోలీసులు విచారిస్తున్నారు. ఆయన తండ్రి, ఆయన సోదరుడు వైద్యుడుగా గుర్తించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది.
నాంపల్లి కోర్టుకు గుర్తుతెలియని వ్యక్తి దగ్గరి నుంచి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ క్రమంలో వెంటనే పోలీసులు అప్రమత్తం అయ్యారు.
ఉగ్రవాదులు నాలుగు కార్లతో బాంబు దాడులు చేయాలని కుట్ర చేశారు. ఉమర్ ఐ20 కారుతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. మిగిలిన మూడు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్‌లో హైఅలర్ట్ కొనసాగుతోంది. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఢిల్లీ పేలుడు ఘటనతో సంబంధం ఉన్న జైష్ మాడ్యూల్ నుంచి పోలీసులు రాబట్టిన సమాచారం ప్రకారం టెర్రర్ ఆపరేటివ్స్ అయిన డాక్టర్ ఉమర్, అమీర్‌లు ఢిల్లీ నుంచి మరో రెండు కార్లు సేకరించినట్టు బయటపడింది.
ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం జరిగిన దాడికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఎర్రకోట క్రాసింగ్ సిగ్నల్ వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.