Delhi School Bomb Threats: ఢిల్లీలో మరోసారి స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు..
ABN , Publish Date - Sep 20 , 2025 | 09:55 AM
ఇప్పటివరకూ ఢిల్లీలోని స్కూల్స్‌కు వచ్చిన బాంబు బెదిరింపులన్నీ నకిలీవని తేలింది. కానీ, ఇలాంటి సంఘటనలు తరచూ జరగడం వల్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది ఆందోళన గురవుతున్నారు.
ఢిల్లీ: దేశ రాజధానిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఢిల్లీలో పలు పాఠశాలలకు వరుసగా.. బాంబు బెదిరింపులు రావడం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. DPS ద్వారక, కృష్ణ మోడల్ స్కూల్, సర్వోదయ స్కూల్‌కి బాంబు బెదిరింపులు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు వెంటనే అప్రమత్తమైన అధికారులు.. విద్యార్థులు, ఉపాధ్యాయులు సహా అందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. అనంతరం ఢిల్లీ ఫైర్ సర్వీస్, పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లు స్కూల్‌కు చేరుకుని తనిఖీలు చేపట్టారు.
కాగా, ఇప్పటివరకూ ఇలా వచ్చిన బాంబు బెదిరింపులన్నీ నకిలీవని తేలింది. కానీ, ఇలాంటి సంఘటనలు తరచూ జరగడం వల్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది ఆందోళన గురవుతున్నారు. పిల్లల భద్రత గురించి ఆలోచిస్తే ఈ బెదిరింపులు ఎంత భయానకంగా ఉన్నాయో అర్థం అవుతుంది. ప్రతి బెదిరింపును సీరియస్‌గా తీసుకున్న అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు.
స్కూళ్లను ఖాళీ చేయడం, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లతో సోదాలు చేయడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. బెదిరింపు వెనుక ఎవరున్నారో కనిపెట్టేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ బెదిరింపు వెనుక ఉన్నది ఎవరు..? తరచూ ఇలాంటి బెదిరింపులకు ఎందుకు పాల్పడుతున్నారు.? ఏదైనా హెచ్చరిక చేస్తున్నారా..? లేదా తమాషాకు చేస్తున్నారా..? అసలు ఈ స్కూల్స్ బెదిరింపుల వల్ల వారు ఏం చేయాలనుకుంటున్నారు ..? అనే విషయాలు దేశా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.