Home » BJP
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఇవాళ(సోమవారం) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
రేపు జరుగనున్న భారత ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్డీఏ, ఇండియా కూటమి.. రెండూ తెలంగాణకు ద్రోహం చేశాయంటోన్న బీఆర్ఎస్.. ఈ ఎన్నికల్లో తటస్థ వైఖరి అవలంభించాలని..
స్వాతంత్ర్యం రాకముందు బ్రిటీష్ పాలనలో వారు ఇష్టానుసారంగా వ్యవహరించారని మల్లు రవి గుర్తు చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నిర్వహణ కూడా బ్రిటిష్ వారి పాలనను తలపించిందని ఆరోపించారు.
బెంగాల్ మాట్లాడే వలస కార్మికులపై ఇతర రాష్ట్రాలలో దాడులు జరుగుతున్నాయంటూ శనివారంనాడు మాల్డాలో టీఎంసీ నిరసన ర్యాలీ జరిపింది. ఇందులో అబ్దుర్ రహీమ్ బక్షి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రాయదుర్గంలో వైసీపీకి కౌన్సిలర్లు షాక్ ఇచ్చారు. మున్సిపల్ వైస్ చైర్మన్ సహా ఐదుగురు బీజేపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో విజయవాడలో శుక్రవారం ఆ పార్టీలో చేరారు.
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే గెలిస్తేతనను సీఎం పదవిలో కూర్చోబెడతానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ముందే చెప్పారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి పేర్కొన్నారు. ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంతో జూలై 7వ తేదీ ప్రారంభించిన ఈపీఎస్ ప్రచారయాత్ర శుక్రవారం తేని జిల్లా కంబం నియోజకవర్గం చేరుకుంది.
తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహాన్ని రూపొందించాలని బీజేపీ అధిష్ఠానం పావులు కదుపుతోంది. అధికారంలోకి వచ్చేందుకు రాష్ట్రంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న పార్టీ..
కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన జీఎస్‌టీ శ్లాబుల్లో భాగంగా సిగరెట్, పొగాకుపై ఉన్న 28 శాతం పన్నును 40 శాతానికి పెంచింది. బీడీలపై పన్నును 28 నుంచి 18 శాతానికి తగ్గించింది. దీన్ని విమర్శిస్తూనే కేరళ కాంగ్రెస్ యూనిట్ పోస్ట్ పెట్టింది.
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి దేవస్థానం వద్ద అన్యమత కార్యక్రమాలను నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు.
బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన కల్వకుంట్ల కవితను తమ పార్టీలోకి తీసుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. బీజేపీలో అవినీతిపరులకు చోటు లేదన్నారు.