Kishan Reddy On Congress: భారత ఆర్మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు: కిషన్ రెడ్డి
ABN , Publish Date - Nov 01 , 2025 | 01:05 PM
పాకిస్థాన్ వైపుకు స్టాండ్ తీసుకొని శత్రు దేశం భాషలో మాట్లాడుతూ శత్రువుల మాటలను సిగ్గు లేకుండా వల్లెవేస్తున్నారని కాంగ్రెస్ నేతలపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధ హోదాలో ఉండి కూడా నిజానిజాలు తెలియకుండా, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
హైదరాబాద్, నవంబర్ 1: కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ మీద కాంగ్రెస్ పార్టీ ప్రేమ, అభిమానం అజరామరమని.. గురువు నుంచి శిష్యుడి దాకా అదే వ్యామోహం అంటూ వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కిషన్ రెడ్డి స్పందిస్తూ.. సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్‌ను చులకన చేస్తూ భారతీయ సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు. పాకిస్థాన్‌కు మద్దతుగా మాట్లాడుతూ భారత ఆర్మీని అగౌరవ పరుస్తున్నామనే సోయి లేకుండా కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ వైపుకు స్టాండ్ తీసుకొని శత్రు దేశం భాషలో మాట్లాడుతూ శత్రువుల మాటలను సిగ్గు లేకుండా వల్లెవేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధ హోదాలో ఉండి కూడా నిజానిజాలు తెలియకుండా, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రికి తెలియని విషయం ఏంటంటే.. పాకిస్థాన్ భూభాగంలో దాక్కున్న ఉగ్రవాదులను, వారి స్థావరాలను భారత గైడెడ్ క్షిపణులు విజయవంతంగా మట్టుబెట్టాయని.. 11 ఎయిర్ బేస్‌లను పూర్తిగా ధ్వంసం చేశాయన్నారు. ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు ముందు ఈ విషయాలను తెలుసుకుని మాట్లాడాలని కిషన్ రెడ్డి హితవుపలికారు.
ఒక్కమాట..
కాంగ్రెస్ అవినీతిపై..
హామీల అమలుపై మాట తప్పిన కాంగ్రెస్ పై..
కాంగ్రెస్ తప్పుడు గ్యారంటీలపై..
ఆ పార్టీ అనుసరిస్తున్న దేశ వ్యతిరేక విధానంపై..
ఓటు బ్యాంకు రాజకీయలపై..
బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల అవకాశవాద రాజకీయాలపై బీజేపీ కార్పెట్ బాంబింగ్ కొనసాగుతుంది అంటూ కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
పదేపదే బాంబు బెదిరింపులు.. ఆందోళనలో ప్రయాణికులు
షాకింగ్ ఘటన... జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం
Read Latest Telangana News And Telugu News