BJP State President: రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది..
ABN , Publish Date - Nov 04 , 2025 | 11:35 AM
రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని, ప్రతిరోజు లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరుగుతున్నాయని, దీనిని అడ్డుకోవడంలో డీఎంకే ప్రభుత్వ విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ అన్నారు.
- నయినార్ నాగేంద్రన్
చెన్నై: రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని, ప్రతిరోజు లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరుగుతున్నాయని, దీనిని అడ్డుకోవడంలో డీఎంకే ప్రభుత్వ విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్(BJP State President Nayanar Nagendran) అన్నారు. కోవైలో ఆదివారం అర్థరాత్రి కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలంరేపింది.
ఈ నేపథ్యంలో, కోవైలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ మహిళా విభాగం అధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్‌తో కలిసి నయినార్ నాగేంద్రన్ మీడియాతో మాట్లాడారు. 2021వ సంవత్సరంలో డీఎంకే ప్రభుత్వం అధికారంలో కూర్చున్నప్పటి నుంచి రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని, డీఎంకే ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని నయినార్ నాగేంద్రన్ ఆరోపించారు.

పోలీస్ శాఖ కూడా ప్రజా రక్షణలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, విమర్శించారు. డీఎంకే ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ తరుఫున ఆందోళనలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఆ తర్వాత వానతీ శ్రీనివాసన్ మాట్లాడుతూ, అత్యాచారానికి పాల్పడిన వారిపై గూండా చట్టం ప్రయోగించి కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అన్ని జిల్లాల్లో 400 కేవీ సబ్‌స్టేషన్లు
Read Latest Telangana News and National News