Home » Bhatti Vikramarka Mallu
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పరుగులు పెడుతోంది. ఈ నెల 7న 15,920 మెగావాట్లుగా డిమాండ్ రికార్డయింది. దాంతో రూఫ్‌టాప్ సోలార్‌తో కలుపుకొని ఇది 16 వేల మెగావాట్లు దాటిందని అధికారులు చెబుతున్నారు.
గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్న వెంటనే వీరు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా తాము జరిపించిన కులగణనను నిష్పాక్షిక ంగా జరిగిన తీరును రేవంత్ వివరించారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన ఆర్థిక బిల్లులను క్లియర్ చేయడానికి ప్రాధాన్యమిస్తున్నామని డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్తు శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
కులగణన సర్వే శాస్త్రీయంగా, పారదర్శకంగా జరిగిందని, దీనిపై ఎవరూ అనుమానం.. అపోహ పడొద్దని కులగణన సబ్ కమిటీ చైర్మన్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
ఉపముఖ్యమంత్రి భట్టితో సోమవారం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు భేటీ అయ్యారు.
CM Revanth Reddy: గద్దర్ చివరి శ్వాస వరకూ తాను నమ్మిన సిద్ధాంతాల కోసం జీవించారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గద్దర్ పేరిట అవార్డు ఇవ్వడమంటే.. ఏటా ఆయనను స్మరించుకోవడమేనని చెప్పారు. గద్దర్ అవార్డుల బాధ్యతను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించామని అన్నారు.
అనంతరం పూర్తి నివేదికను క్యాబినెట్ సబ్ కమిటీకి ఫిబ్రవరి 2 నాటికి అధికారులు అందజేయనున్నారు. ఆ వెంటనే సబ్‌కమిటీ సమావేశమై.. నివేదికపై చర్చిస్తుంది. ఆపై రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయి.. బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించి, నిర్ణయం తీసుకుంటుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని.. తెలంగాణ ఏర్పాటు, అస్తిత్వం, ఆత్మగౌరవం ప్రశ్నార్థకంగా మారిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
KTR:రేవంత్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. వన్ విలేజ్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్య పెడతోందని కేటీఆర్ ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న నాలుగు కీలక పథకాలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పథకాలను సర్కారు ప్రారంభించబోతోంది.