Home » Bhatti Vikramarka Mallu
ప్రభుత్వం నిర్వహించిన కులగణన ఎట్లా తప్పో చెప్పాలంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలకు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. బట్ట కాల్చి మీద వేయడం కాదని, రాష్ట్రంలోని ఏ బ్లాక్‌లోని ఏ ఇంట్లో లెక్క తప్పు జరిగిందో చూపాలన్నారు.
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ యువతకు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రూ.3 వేల కోట్లతో స్వయం ఉపాధి పథకాలను అందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఉన్నత విద్యపై కేంద్ర ప్రభుత్వ గుత్తాధిపత్యం తగదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. యూనివర్సిటీలకు నిధుల కేటాయింపు, నిర్వహణ బాధ్యతలను రాష్ట్రాలకు అప్పజెప్పి.. వైస్ చాన్స్లర్ల నియామకాలు, అడ్మిషన్లు వంటి కీలక బాధ్యతలను కేంద్రం తన వద్దే పెట్టుకోవడం సరికాదన్నారు.
ఎల్ఆర్ఎస్ ప్రక్రియ వేగవంతానికి ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. మార్చి 31లోపు ఎల్ఆర్ఎస్ చేయించుకునే దరఖాస్తుదారులకు 25 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు.
రాష్ట్రంలోని బిల్డర్లు, డెవలపర్లు సంపద సృష్టికర్తలని, వారిని గౌరవప్రద పౌరులుగా చూస్తామని, సంపూర్ణ సహకారం అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు.
విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక పునర్ వ్యవస్థీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రివాంప్డ్ డిస్ర్టిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్డీఎ్సఎ్స)లో రాష్ట్రం చేరనుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల (సమగ్ర ఇంటింటి కుటుంబ) సర్వే విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇదివరకు నిర్వహించిన సర్వేలో మిగిలిపోయిన 3.1 శాతం కుటుంబాల కోసం మరోమారు సర్వే చేపట్టాలని నిర్ణయించింది.
‘‘వేసవి నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్తు అంతరాయం ఉండొద్దు. రెప్పపాటు కాలం కూడా కరెంట్ కట్ కావొద్దు. వేసవి డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా ఉండాలి’’ అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.