Share News

Bhatti Vikramarka: వ్యవసాయ మార్కెట్లలో ఇసుక నిల్వలు

ABN , Publish Date - Mar 09 , 2025 | 03:07 AM

రాష్ట్రంలో సామాన్యులకు ఇసుకను అందుబాటులోకి తేవాలని, అన్ని వ్యవసాయ మార్కెట్లలో ఇసుక స్టాక్‌ యార్డులను ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

Bhatti Vikramarka: వ్యవసాయ మార్కెట్లలో ఇసుక నిల్వలు

  • రాష్ట్రవ్యాప్తంగా సామాన్యులకు అందుబాటులో ఉంచండి

  • ఆదాయ వనరుల సమీకరణ సబ్‌కమిటీ భేటీలో భట్టి

హైదరాబాద్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సామాన్యులకు ఇసుకను అందుబాటులోకి తేవాలని, అన్ని వ్యవసాయ మార్కెట్లలో ఇసుక స్టాక్‌ యార్డులను ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం ప్రజాభవన్‌లో ఆదాయ వనరుల సమీకరణ మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నగరవాసులకు ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇటీవల రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ.. ఔటర్‌ రింగు రోడ్డుకు సమీపంలో ఇసుక స్టాక్‌ యార్డులను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.


అదే పద్ధతిలో రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లలోనూ స్టాక్‌ యార్డులను ఏర్పాటు చేస్తే.. సామాన్యులకు అందుబాటులోకి వస్తుందన్నారు. దీనిపై గనులు, భూగర్భ వనరుల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుకకు సంబంధించి ఐటీడీఏలతో త్వరగా ఒప్పందం చేసుకోవాలన్నారు. ఆదాయం ఆర్జించే శాఖల్లో లీకేజీలను అరికట్టాలని, ప్రభుత్వం నిర్దేశించిన రాబడి లక్ష్యాలను సాధించాలని చెప్పారు. గనుల శాఖ ద్వారా ఆదాయాన్ని పెంచే మార్గాలను ఆలోచించాలన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో..

Car Accident: అంతా చూస్తుండగానే అదుపుతప్పిన కారు.. క్షణాల్లోనే..

Updated Date - Mar 09 , 2025 | 03:07 AM