Home » AV Ranganath
హైడ్రా వంటి సంస్థ ప్రతి రాష్ట్రంలో ఉండాలని ఢిల్లీ మునిసిపల్ అధికారుల బృందం అభిప్రాయపడింది. హైడ్రా ఉంటేనే చెరువులు, నాలాలు ఆక్రమణకు గురికాకుండా ఉంటాయని పేర్కొంది. అంబర్‌పేటలో హైడ్రా పునర్నిర్మించిన బతుకమ్మకుంట చెరువును ఆ బృందం బుధవారం సందర్శించింది.
గండిపేట మండలంలోని పుప్పాలగూడ గ్రామంలో 200 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా అరికట్టి చరిత్రను కాపాడతామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు.
లే అవుట్‌లను ప్రామాణికంగా తీసుకొని పార్కులు, రోడ్లు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కబ్జాదారుల చెర నుంచి కాపాడుతామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. నివాస ప్రాంతాల్లో పార్కుల ఆవశ్యకతను అర్థం చేసుకొని వాటిని ఆక్రమించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
వరదనీరు సున్నం చెరువులో కలిసేలా మురుగునీరు కిందకు పోయేలా నాలాల నిర్మాణం ఉండాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులకు సూచించారు. బోరబండ, సున్నం చెరువు ప్రాంతాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. అల్లాపూర్, బోరబండ డివిజన్లను కలుపుతూ సాగే నాలాలను విస్తరించాలన్నారు.
నగరంలోని నాలాలు, క్యాచ్‌పిట్లు, కల్వర్టుల్లోని చెత్తను హైడ్రా బృందాలు తొలగిస్తున్నాయి. హైడ్రా డీఆర్‌ఎఫ్ (డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు), ఎంఈటీ (మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్స్) బృందాలు నిరంతరాయంగా నాలాల్లో చెత్తను తొలగిస్తున్నాయి.
హైడ్రా నగరానికి రక్షణగా నిలిచిందని, ఆక్రమణదారుల పట్ల బుల్డోజర్‌లా వ్యవహరించిందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైడ్రా ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న చర్యల గురించి కమిషనర్ సోమవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో సామాజిక కోణంలో చూసి పేదల ఇళ్లు కూల్చడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. కబ్జాలు చేసిన వారే హైడ్రాపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. సెప్టెంబర్ 21వ తేదీన బతుకమ్మ కుంటను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని రంగనాథ్ పేర్కొన్నారు.
హైడ్రా.. రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంస్థ అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న సంస్థ..
పాత బస్తీలోని సూరం చెరువులో నిర్మించిన ఒవైసీ ఫాతిమా కాలేజీపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ కాలేజీ నడుస్తోందని చెప్పుకొచ్చారు. అలాగే ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు. అందుకనే ఈ కాలేజీని కూల్చివేయడానికి ఆలోచిస్తున్నామని ఏవీ రంగనాథ్ స్పష్టత ఇచ్చారు.
రాజేంద్రనగర్‌లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేయడానికి వచ్చిన అధికారులతో వాగ్వాదానికి స్థానికులు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పార్క్ స్థలం కబ్జా చేయడంతోనే కూల్చివేతలు చేపట్టామని హైడ్రా అధికారులు చెబుతున్నారు.