Home » AP Police
ఏపీలో సంచలనం రేపుతున్న మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన కేఎన్‌ఆర్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు రెండో రోజు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
విజయవాడలో వెలుగుచూసిన ఈ టెర్రర్ లింక్స్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఇప్పటివరకు ఈ కేసులో విజయవాడకు చెందిన ముగ్గురితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో తీవ్ర రాజకీయ కలకలం రేగుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి (రాజారెడ్డి)ని పోలీసులు అరెస్ట్ చేశారు.
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత సంవత్సరం అనుమానాస్పద స్థితిలో తోపుదుర్తి మహేశ్వరరెడ్డి మృతిచెందిన విషయం తెలిసిందే.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తున్న సితారా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కూలింగ్ కెనాల్ డివైడర్‌ను ఢీకొంది. అయితే బస్సు ముందుభాగం కూలింగ్ కెనాల్ వంతెనను ఢీకొని అక్కడే ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలేకమ్మ గుడి సమీపంలోని జాతీయ రహదారిపై రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
తెనాలిలో మహిళ ఆత్మహత్యాయత్నం ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియో విడుదల చేసింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పులివెందులకు చెందిన టీడీపీ నేత పేర్ల పార్థసారథి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రిలయన్స్ ఆస్తులను ధ్వంసం చేయలేదా? అని ప్రశ్నించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రౌడీషీట్ ఉందని విమర్శించారు.
వైసీపీ నేత, మాజీ డిఫ్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి రెండు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య కేసులో నిత్యానంద రెడ్డిని చిన్నచౌక్ పోలీసులు విచారించారు.