Home » AP Cabinet Meet
వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ, తాడిగడప మున్సిపాలిటీగా మార్చే డ్రాఫ్ట్ బిల్లుకు పలు సవరణలు చేస్తూ కేబినెట్‌లో ఆమోదం ముద్రపడింది. రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్ద ప్రాజెక్టుల అమలుకు ప్రత్యేక వాహక నౌకలను ఏర్పాటు చేస్తూ మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో నేడు మంత్రి మండలి సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అసెంబ్లీలోని సీఎం పేషీలో ఈ సమావేశం జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీలో నాలుగు స్లాబ్‌లను రెండుకు కుదించి నిత్యావసరాల ధరలు తగ్గించడం చారిత్రాత్మక సంస్కరణ అని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. సరళమైన వృద్ధి, ఆధారిత పన్ను విధానం ఒక నిర్ణయాత్మక అడుగును సూచిస్తోందని తెలిపారు. ఈ మైలురాయి సంస్కరణలు చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్రమోదీని ప్రత్యేకంగా అభినందిస్తున్నామని లోకేష్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో గురువారం కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ భేటీలో సుమారు 30 అంశాల ఎజెండాగా మంత్రి మండలి చర్చించనుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించే పలు బిల్లులు, చట్ట సవరణలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై అసెంబ్లీ సమావేశాల్లో విశేష చర్చ జరిగే అవకాశముంది. రాష్ట్రంలోని ముఖ్యమైన అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ(గురువారం) ఏపీ సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు, మంత్రివర్గం ఆమోదం తెలిపిన అంశాల గురించి మంత్రి కొలుసు పార్థ సారధి మీడియాకు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. కేబినెట్ భేటీలో ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నేతలు ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తిస్తే ఉపేక్షించేంది లేదని హెచ్చరించారు.
భూముల కేటాయింపు విషయంలో మంత్రివర్గ ఉఫసంఘం తీసుకున్న నిర్ణయాలకు సీఆర్డీఏ అధారిటీలో ఆమోదముద్ర వేశామని మంత్రి నారాయణ తెలిపారు. వీటిని ఈనెల 21వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో వీటికి ప్రభుత్వం ఆమోదం తెలపనుందని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు.
CM Chandrababu: ఏపీలో కూటమి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్ని జిల్లాలకు పేర్లు మార్చడంతో పాటు పలు నియోజకవర్గాలు పక్క జిల్లాల్లో విలీన ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధమైంది.