Home » AP Assembly Budget Sessions
రహదారుల పక్కన ఉన్న భారీ వృక్షాలును విస్తరణ సమయంలో తొలగిస్తున్నారని.. వందేళ్లకు పైగా వయసున్న చెట్లను తొలగించటం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. వాటిని వేరే ప్రాంతానికి తరలించడానికి ప్రత్యేక పాలసీ తీసుకువస్తున్నామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 14వ రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో రెండు బిల్లులను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
ఏపీ శాసనమండలిలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై చర్చ విషయంలో గందరగోళం నెలకొంది. ఒకే అంశంపై ఒకే రోజు రెండు తీర్మానాలను ఆమోదించడం మంచిది కాదంటూ మండలి చైర్మన్ తీరును తప్పుపట్టారు మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్.
ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలన్నదే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఫ్యాక్షన్‌కు అడ్డుకట్ట వేసి బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు.
జగన్ హయాంలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశారు. వ్యవసాయంలో జాతీయ జీడీపీలో ఏపీకి పది శాతం వాటా ఉందని ప్రస్తావించారు.
జగన్ హయాంలో 913 కంపెనీలు ఏపీ నుంచి వెళ్లిపోయాయని ఏపీ మంత్రి టీజీ భరత్ తెలిపారు. జగన్ హయాంలో పారిశ్రామిక ప్రగతి ఎలా ఉందో ఆర్బీఐ నివేదిక ద్వారా అర్థమవుతోందని పేర్కొన్నారు.
వైసీపీ.. వాకౌట్ అండ్ టాకౌట్ పార్టీగా మారిందని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. జగన్ అండ్ కో నిజస్వరూపం ఇప్పడు రాయలసీమ ప్రజలందరికీ తెలిసిపోయిందన్నారు..
లైన్‌మెన్‌ల నియామకంపై ఏపీ శాసనమండలిలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మండలి సభ్యులు, ఆలపాటి రాజా, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు అడిగిన ప్రశ్నకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమాధానం ఇచ్చారు..
పోలవరం - నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గోదావరి నుంచి సముద్రంలోకి వృథాగా వెళ్లే వరద జలాలను ఆయా ప్రాజెక్ట్‌లకు తరలిస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 11వ రోజుకు చేరుకున్నాయి. నేడు ఉభయ సభల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టడంతోపాటు, వివిధ శాఖల వారీగా బడ్జెట్ పద్దులపై సుదీర్ఘ చర్చ జరపనుంది.