• Home » Anantapur urban

Anantapur urban

WHIP KALAVA: రైతు రథాలు ఇవ్వాలి

WHIP KALAVA: రైతు రథాలు ఇవ్వాలి

అన్నదాత అవసరాలకు అనుగుణంగా మండలానికి 50 రైతు రథాలు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు విన్నవించారు. అసెంబ్లీలో సోమవారం రైతు సమస్యలపై ఆయన మాట్లాడారు.

PACKETS: వామ్మో.. మూటలు..!

PACKETS: వామ్మో.. మూటలు..!

మండలంలోని ఎర్రంపల్లి వద్ద సోమవారం దుర్వాసన వెదజల్లుతూ రైల్వేట్రాక్‌ పక్కన, వంతెన కింద పడి ఉన్న మూటలు కలకలం రేపాయి. రైల్వే, స్థానిక పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించింది. ఎర్రంపల్లి సమీపంలోని రైల్వేట్రాక్‌ పక్కన మూడుచోట్ల వేర్వేరుగా ప్లాస్టిక్‌ సంచి మూటలు పడి ఉన్నాయి.ఒక్కో మూట మధ్య అర కిలోమీటరు మేర దూరం ఉంది.

HOSTEL : అదే నిర్లక్ష్యం..!

HOSTEL : అదే నిర్లక్ష్యం..!

ఎస్సీ సంక్షేమ వసతిగృహాల్లో జరుగుతున్న రెండో విడత మరమ్మతుల పనుల్లో మరోసారి డొల్లతనం బయటపడింది. కాంట్రాక్టర్లు ఆదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. గత నెల ఆంధ్రజ్యోతిలో ‘నాణ్యత ప్రశ్నార్థకం’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఇందుకు ఆ శాఖ అధికారులతో పాటు ఏపీఈడబ్ల్యూఐడీసీ శాఖ డీఈ పరిశీలించారు. సంబంధిత కాంట్రాక్టర్లకు హెచ్చరికలు జారీచేశారు.

BUILDING : నిరుపయోగంగా అభ్యుదయ భవన

BUILDING : నిరుపయోగంగా అభ్యుదయ భవన

నగర నడి బొడ్డున సభలు, సమావేశాలు నిర్వహించేందుకు అనువుగా ఉన్న డీఆర్‌డీఏ అభ్యు దయ భవన పదేళ్లుగా నిరుపయోగంగా ఉంది. 1986లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌ కుముద్‌బెన జోషి చేతుల మీదుగా అభ్యుదయ భవనను ప్రారంభించారు. అప్పటి నుంచి 2014 వరకు అంటే సుమారు 32ఏళ్ల పాటు ఎన్నో సమీక్షలు, సమావేశాలు, సభల నిర్వహణకు ఆ భవనం వేదికైంది.

CORPORATION : బడ్జెట్‌ అంశంతోనే సరిపెడతారా..?

CORPORATION : బడ్జెట్‌ అంశంతోనే సరిపెడతారా..?

కేవలం బడ్జెట్‌ అంశంతోనే కౌన్సిల్‌ సమావేశం జరుగుతుందా...? మరి కొన్ని అంశాలపైనా చర్చ నడుస్తుందా...? అనేది చర్చనీయాంశంగా మారింది. నగర పాలక సంస్థ కార్యాలయం కౌన్సిల్‌ హాల్‌లో సోమవారం బడ్జెట్‌ అంశంపై సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుత పాలకవర్గం ప్రతి ఏటా బడ్జెట్‌ అంశంపైనే ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ, సభ్యులు వివిధ అంశాలపై ప్రశ్నించేవారు.

STUDENTS : ఉరుకులతో ఊరికి..!

STUDENTS : ఉరుకులతో ఊరికి..!

వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చి హాస్టళ్లు, ప్రైవేట్‌ గదుల్లో అద్దెకు ఉండి రెండేళ్లపాటు కొనసాగిన ఇంటర్మీడియట్‌ చదువులు శనివారం నాటికి ముగిశాయి. ద్వితీయ సంవత్సరం పరీక్షలు పూర్తయ్యాయి. తల్లిదండ్రులతో సొంతూరిలో సరదాగా గడపడం కోసం ఎపుడెపుడా అని నిరీక్షించిన విద్యార్థులకు ఆ సమయం వచ్చేసింది. పరీక్షలు ముగిసిన వెంటనే సొంతూళ్లకు ఉరుకులు పరుగులు పెట్టారు.

SURVEY: ఎట్టకేలకు ఎంఎస్‌ఎంఈల సర్వే పూర్తి

SURVEY: ఎట్టకేలకు ఎంఎస్‌ఎంఈల సర్వే పూర్తి

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమల సర్వే ఎట్టకేలకు పూర్తైంది. మూడున్నర నెలల కుస్తీ నేపథ్యంలో సర్వే వంద శాతం పూర్తి కావడంతో సంబంధిత అధికారులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. పారిశ్రామిక వేత్తలు, వ్యాపా రుల వివరాలను నమోదు చేయడం ద్వారా ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందేందుకు అవకాశం ఉంది. గత ఏడాది నవంబరు ఆఖరు వారంలో ఎంఎస్‌ఎంఈ సర్వే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

MLA : రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలి

MLA : రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలి

రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టిసారించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. రెవె న్యూ సమస్యలను జఠిలం చేసుకోకుండా రాజీ మార్గంలో వెళితే ఇరువర్గాల కు నష్టం ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. మండల కేంద్ర మైన రామగిరిలో పంచాయతీ రాజ్‌ శాఖ గెస్ట్‌హౌస్‌లో శనివారం ఎమ్మెల్యే ప్రజాదర్భార్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

AWERNESS: చట్టంపై చైతన్యం పెరగాలి

AWERNESS: చట్టంపై చైతన్యం పెరగాలి

వినియోగదారుల రక్షణ చట్టంపై ప్రజల్లో చైతన్యం రావాల్సిన ఉందని వినియోగదారుల కమిషన అధ్యక్షురాలు శ్రీలత అన్నారు. అప్పుడే చట్టం లక్ష్యం నెరవేరుతుందన్నారు.

CITU: స్టీల్‌ ప్లాంట్‌కు గనులు.. నిధులు ఇవ్వాలి

CITU: స్టీల్‌ ప్లాంట్‌కు గనులు.. నిధులు ఇవ్వాలి

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్రం గనులు, నిర్వహణ నిధులు ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు డిమాండ్‌ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరసనలో భాగంగా శుక్రవారం స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి