STUDENTS : ఉరుకులతో ఊరికి..!
ABN , Publish Date - Mar 16 , 2025 | 01:12 AM
వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చి హాస్టళ్లు, ప్రైవేట్ గదుల్లో అద్దెకు ఉండి రెండేళ్లపాటు కొనసాగిన ఇంటర్మీడియట్ చదువులు శనివారం నాటికి ముగిశాయి. ద్వితీయ సంవత్సరం పరీక్షలు పూర్తయ్యాయి. తల్లిదండ్రులతో సొంతూరిలో సరదాగా గడపడం కోసం ఎపుడెపుడా అని నిరీక్షించిన విద్యార్థులకు ఆ సమయం వచ్చేసింది. పరీక్షలు ముగిసిన వెంటనే సొంతూళ్లకు ఉరుకులు పరుగులు పెట్టారు.

అనంతపురం కల్చరల్, మార్చి 15(ఆంధ్రజ్యోతి): వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చి హాస్టళ్లు, ప్రైవేట్ గదుల్లో అద్దెకు ఉండి రెండేళ్లపాటు కొనసాగిన ఇంటర్మీడియట్ చదువులు శనివారం నాటికి ముగిశాయి. ద్వితీయ సంవత్సరం పరీక్షలు పూర్తయ్యాయి. తల్లిదండ్రులతో సొంతూరిలో సరదాగా గడపడం కోసం ఎపుడెపుడా అని నిరీక్షించిన విద్యార్థులకు ఆ సమయం వచ్చేసింది. పరీక్షలు ముగిసిన వెంటనే సొంతూళ్లకు ఉరుకులు పరుగులు పెట్టారు. పరీక్షా కేంద్రాల నుంచి బయటకు వస్తూనే కేరింతలతో సందడి చేశారు. ఆటోలు, బస్సుల్లో ఈలలు వేస్తూ ఉత్సాహంగా ఇంటి బాట పట్టేశారు. ఊళ్లకు వెళ్లే విద్యార్థులు, ప్రయాణికులతో జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. రద్దీ నేపథ్యంలో శనివారం కూడా ఆర్టీసీ అధికారులు అదనపు సర్వీసులేవీ కేటాయించకపోవడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు. పరీక్షలు ముగిసిన అనంతరం మధ్యాహ్నం 12.15 నుంచి 1.20 గంటల వరకు ఆర్టీసీ బస్టాండు వెలుపలి రోడ్డు, శ్రీకంఠం సర్కిల్‌తోపాటు పలు ప్రధాన కూడళ్లు ట్రాఫిక్‌తో స్తంభించిపోయాయి.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....