Share News

BUILDING : నిరుపయోగంగా అభ్యుదయ భవన

ABN , Publish Date - Mar 16 , 2025 | 11:53 PM

నగర నడి బొడ్డున సభలు, సమావేశాలు నిర్వహించేందుకు అనువుగా ఉన్న డీఆర్‌డీఏ అభ్యు దయ భవన పదేళ్లుగా నిరుపయోగంగా ఉంది. 1986లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌ కుముద్‌బెన జోషి చేతుల మీదుగా అభ్యుదయ భవనను ప్రారంభించారు. అప్పటి నుంచి 2014 వరకు అంటే సుమారు 32ఏళ్ల పాటు ఎన్నో సమీక్షలు, సమావేశాలు, సభల నిర్వహణకు ఆ భవనం వేదికైంది.

BUILDING : నిరుపయోగంగా అభ్యుదయ భవన
The unused DRDA Abhyudaya Bhavan

- రూ. 25లక్షలతో చేసిన పనులకు తుప్పు

- పదేళ్లుగా పట్టించుకోని అధికారులు

అనంతపురం క్లాక్‌టవర్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): నగర నడి బొడ్డున సభలు, సమావేశాలు నిర్వహించేందుకు అనువుగా ఉన్న డీఆర్‌డీఏ అభ్యు దయ భవన పదేళ్లుగా నిరుపయోగంగా ఉంది. 1986లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌ కుముద్‌బెన జోషి చేతుల మీదుగా అభ్యుదయ భవనను ప్రారంభించారు. అప్పటి నుంచి 2014 వరకు అంటే సుమారు 32ఏళ్ల పాటు ఎన్నో సమీక్షలు, సమావేశాలు, సభల నిర్వహణకు ఆ భవనం వేదికైంది. అనంతరం అభ్యుదయభవన నిర్వహణ బాధ్యతను డీఆర్‌డీఏకు అప్పగించా రు. శిథిలావస్థకు చేరిన భవనానికి 2014లో అప్పటి కలెక్టర్‌ కోన శశిధర్‌ ప్రత్యేక చొరవతో రూ. 25లక్షలు వెచ్చించి మరమ్మతులు చేయించారు. దెబ్బతిన్న గోడలకు మరమ్మతులు చేశారు. మరుగుదొడ్లు నిర్మించారు. రంగులు వేశారు., ఏసీలు ఏర్పాటు చేశారు. ఇంకా అభ్యుదయ భవన లోపల కూర్చోవడానికి కుర్చీలు, ఇతర ఫర్నీచర్‌ కోసం మరో రూ. 30 లక్షల వరకు నిధులు అవసరం ఉంది. అప్పట్లో ఆ కలెక్టర్‌ బదిలీపై వెళ్లిపోయారు. ఇక తరువాత వచ్చిన కలెక్టర్లు, డీఆర్‌డీఏ పీడీలు అభ్యుదయభవన గురించి పట్టించుకోలేదు. దీంతో 2014లో రూ. 2లక్షలతో చేసిన మరమ్మత్తులు, ఏసీలు పనికిరాకుండా పోయాయి. మిగిలిన ఏసీలతో పాటు ఐరన, ఇతర సామగ్రి తుప్పు పట్టింది. అభ్యుదయభవన నిరుపయోగంగా మారి పోయిం ది. దీనిపై డీఆర్‌డీఏ పీడీ ఈశ్వరయ్య వివరణ ఇస్తూ... కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ అభ్యుదయభవన ను పరిశీలించారని తెలిపారు. దానిని తిరిగి అందుబాటులోకి తీసుకురావడానికి ఏయే పనులు చేపట్టాలి? ఎంత నిధులు అవసరం అవుతాయో అంచనా వేయాలని ఇప్పటికే ఏపీడబ్ల్యూఐడీసీ ఇంజనీర్లను ఆదేశించినట్లు తెలిపారు. త్వరలో అభ్యుదయ భవనలో ఫర్నీచర్‌ ఏర్పాటు చేసి ఉపయోగంలోకి తెచ్చేందుకు కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 16 , 2025 | 11:53 PM