SURVEY: ఎట్టకేలకు ఎంఎస్‌ఎంఈల సర్వే పూర్తి
ABN , Publish Date - Mar 16 , 2025 | 01:08 AM
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమల సర్వే ఎట్టకేలకు పూర్తైంది. మూడున్నర నెలల కుస్తీ నేపథ్యంలో సర్వే వంద శాతం పూర్తి కావడంతో సంబంధిత అధికారులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. పారిశ్రామిక వేత్తలు, వ్యాపా రుల వివరాలను నమోదు చేయడం ద్వారా ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందేందుకు అవకాశం ఉంది. గత ఏడాది నవంబరు ఆఖరు వారంలో ఎంఎస్‌ఎంఈ సర్వే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

- మూడున్నర నెలలుగా కుస్తీ
- తొలి రెండు నెలల్లో నత్తనడకన
- కలెక్టర్ ప్రత్యేక పర్యవేక్షణతో కొలిక్కి
అనంతపురం అర్బన, మార్చి 15(ఆంధ్రజోతి) : సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమల సర్వే ఎట్టకేలకు పూర్తైంది. మూడున్నర నెలల కుస్తీ నేపథ్యంలో సర్వే వంద శాతం పూర్తి కావడంతో సంబంధిత అధికారులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. పారిశ్రామిక వేత్తలు, వ్యాపా రుల వివరాలను నమోదు చేయడం ద్వారా ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందేందుకు అవకాశం ఉంది. గత ఏడాది నవంబరు ఆఖరు వారంలో ఎంఎస్‌ఎంఈ సర్వే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది జనవరి నెలాఖరుతో తొలుత విధించిన గడువు మగిసింది. అయితే అప్పటి దాకా కేవలం 37.26 శాతం యూనిట్లపై సర్వే చేయడంతో సరిపెట్టారు. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీ దాకా గడువు పొడిగించారు. సర్వే నత్తనడకగా సాగుతోందని ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక కథనాలు ప్రచురిత మయ్యాయి ఈ నేపథ్యంలో స్పందించిన కలెక్టర్ వినోద్‌కుమార్ ఎంఎస్‌ఎం ఈ సర్వేను వేగవంతం చేసేందుకు నిరంతర పర్యవేక్షణ పెట్టారు. సంబంఽ దిత అధికారులతో తరచూ సమావేశాలు, వీడియో కాన్ఫరెన్సలు నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ వచ్చారు. పరిశ్రమల శాఖలోని కొందరు అధికారులకు నగరంలోని డివిజన్లల్లో పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పలు ప్రాంతాల్లో ఆయన స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి, సర్వేపై ఆరా తీశారు. ఈ పరిస్థితుల్లో గడువులోగా ఎట్టకేలకు జిల్లాలో ఎంఎస్‌ఎంఈ సర్వే విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా 89,666 ఎంఎస్‌ఎంఈలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆఖరు గడువు శనివారం నాటికి వంద శాతం ఎంఎస్‌ఎంఈలను సర్వే చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం నివేదికలు పంపింది.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....