HOSTEL : అదే నిర్లక్ష్యం..!
ABN , Publish Date - Mar 16 , 2025 | 11:58 PM
ఎస్సీ సంక్షేమ వసతిగృహాల్లో జరుగుతున్న రెండో విడత మరమ్మతుల పనుల్లో మరోసారి డొల్లతనం బయటపడింది. కాంట్రాక్టర్లు ఆదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. గత నెల ఆంధ్రజ్యోతిలో ‘నాణ్యత ప్రశ్నార్థకం’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఇందుకు ఆ శాఖ అధికారులతో పాటు ఏపీఈడబ్ల్యూఐడీసీ శాఖ డీఈ పరిశీలించారు. సంబంధిత కాంట్రాక్టర్లకు హెచ్చరికలు జారీచేశారు.

- ఎస్సీ హాస్టల్ మరమ్మతుల్లో డొల్లతనం బట్టబయలు
అనంతపురం ప్రెస్‌క్లబ్, మార్చి 16(ఆంధ్రజ్యోతి): ఎస్సీ సంక్షేమ వసతిగృహాల్లో జరుగుతున్న రెండో విడత మరమ్మతుల పనుల్లో మరోసారి డొల్లతనం బయటపడింది. కాంట్రాక్టర్లు ఆదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. గత నెల ఆంధ్రజ్యోతిలో ‘నాణ్యత ప్రశ్నార్థకం’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఇందుకు ఆ శాఖ అధికారులతో పాటు ఏపీఈడబ్ల్యూఐడీసీ శాఖ డీఈ పరిశీలించారు. సంబంధిత కాంట్రాక్టర్లకు హెచ్చరికలు జారీచేశారు. అయినా వారు మరోసారి నిబంధనలకు, నాణ్యతకు తిలోదకాలిచ్చారనే చెప్పాలి. నగరంలోని ఎస్సీ నెం-4 ప్రీమెట్రిక్ హాస్టల్‌లో జరుగుతున్న పనులను డీఈ రమణారెడ్డి ఇటీవల పరిశీలించారు. అక్కడ కాంట్రాక్టర్ లేక పోగా, మోటార్ పైపులైన పనులు అస్తవ్యస్తంగా కనిపించాయి. దీంతో డీఈ అక్కడ పనులు చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. మరోవైపు మరుగుదొడ్ల నిర్మాణానికి క్యూరింగ్ కానట్టి సిమెంట్ పెళ్లలు అక్కడుండటం గమనించి అసహనం వ్యక్తం చేశారు.
ఏఈలు, కాంట్రాక్టర్ల కుమ్మక్కు..?
జిల్లాలోని ఎస్సీ సంక్షేమ వసతగృహాల్లో చేపడుతున్న పనుల్లో కొందరు ఏఈలు, కాంట్రాక్టర్ల కుమ్మక్కు వ్యవహారంతోనే నాసిరకం పనులు జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పర్యవేక్షణ బాధ్యతలను డివిజన్ల వారీగా ఏఈలకు అప్పజెప్పారు. వారు ఇష్టా నుసారంగా ప్లానింగ్, ఎస్టిమేషనలు వేస్తూ నాణ్యతకు తిలోదకాలి స్తున్నట్లు విమర్శలున్నాయి. నాసిరకపు మెటీరియల్‌తో పనులు చేప డుతున్నారని, ఉన్నతాధికారులు చూసీచూడనట్లు ఉండటంతో ఇలా జరుగుతోందని ఆయాశాఖల అధికారులే అంటున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వసతిగృహాల మరమ్మతు పనుల ను నాణ్యంగా చేపట్టాలని పదే పదే చెబుతున్న కలెక్టర్ ఈ నాసిరకపు పనులపై ఏవిధంగా స్పందిస్తారో వేచిచూడాలి.
పైపులైన పనులు సక్రమంగా లేవు- రమణారెడ్డి, డీఈ, ఏపీఈడబ్ల్యూఐడీసీ
ఎస్సీ నెం-4 వసతిగృహంలో మోటార్ పైపులైన నిర్మాణం అస్త వ్యస్తంగా ఉంది. ప్రతిరోజూ ప్రతి హాస్టల్‌లో జరుగుతున్న పనులను పరిశీలిస్తున్నాం. అందులో భాగంగా నెం-4 హాస్టల్‌లో పనుల పరిశీలనలో పైపులైన పనులు సక్రమంగా చేయకపోవడం కనిపిం చింది. సంబంధిత కాంట్రాక్టర్‌ను హెచ్చరించాం. పనుల విషయం లో నాణ్యత లోపిస్తే సంబంధిత కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....