CITU: స్టీల్ ప్లాంట్‌కు గనులు.. నిధులు ఇవ్వాలి
ABN , Publish Date - Mar 14 , 2025 | 11:57 PM
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం గనులు, నిర్వహణ నిధులు ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరసనలో భాగంగా శుక్రవారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.

అనంతపురం కల్చరల్, మార్చి 14(ఆంధ్రజ్యోతి): విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం గనులు, నిర్వహణ నిధులు ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరసనలో భాగంగా శుక్రవారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఓబులు మాట్లాడుతూ... విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షిస్తామని కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ, జనసేన పార్టీలు ఎన్నికల ముందు హా మీ ఇచ్చాయన్నారు. కేంద్ర మంత్రి కుమారస్వామి, స హాయ మంత్రి శ్రీనివాసవర్మ జనవరి 29న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సందర్శించి, ప్యాకేజీ ప్రకటించారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ నిధులను అప్పు లు తీర్చడానికే ఉపయోగించాలనీ పేర్కొనడం సరికాదన్నారు. కార్మికుల జీతాలు, ముడిసరుకు కొనుగోలు, నిర్వహణ పరికరాలు కొనేందుకు వినియోగించరాదని ప్రకటించారన్నారు. దీనిని బట్టి ప్యాకేజీ నిధులతో అప్పులు తీర్చి, ప్రైవేటు వారికి అప్పులులేని ప్లాంట్‌ను ధారాదత్తం చేయాలనే కుట్ర స్పష్టమవుతోందని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రధాన సమస్య సొంత గనులు లేకపోవడమేనన్నారు. నాణ్యమైన స్టీల్ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్‌కు సొంత గనులు ఎందుకివ్వరని ప్రశ్నించారు. సొంతగనులు ఉన్న ప్లాంట్‌కు టన్ను రూ.వెయ్యిలోపు ముడి ఇనుప ఖనిజం దొరుకుతోందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రం మార్కెట్‌లో టన్నుకు రూ.6వేల నుంచి రూ.8వేల వరకు వెచ్చించాల్సి వస్తోందన్నారు. ఈ భారమే ప్లాంట్‌ను కుంగదీస్తోందన్నారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్, మున్సిపల్ యూనియన, ఆటో కార్మిక నేతలు పాల్గొన్నారు.