Home » Anakapalli
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి పరిసర ప్రాంతాల్లో స్వల్ప భూకంపం సంభవించింది. అర్ధరాత్రి 12:28 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు.
కస్తుర్బా గాంధీ హాస్టల్‌లో విద్యార్థిని పాము కాటుకు గురై చనిపోయిన ఘటనకు సంబంధించి ఐదుగురిపై సస్పెన్షన్ వేటు పడింది. కస్తూర్బా స్కూల్ ప్రిన్సిపల్ ఉమాదేవి, ఇద్దరు టీచర్లు, వాచ్ ఉమెన్, ఏఎన్ఎమ్ ఈశ్వరిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
అనకాపల్లి జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ముగ్గురు యువకులు మృతి చెందారు.
అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఏపీ పారిశ్రామిక రంగంలో చారిత్రాత్మక ఘట్టమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేశారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్లాంట్‌కు సోమవారం భూమి పూజ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్లాంట్‌కు రేపు(సోమవారం) భూమి పూజ జరగనుంది. కేంద్ర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో గొప్ప ముందడుగు పడింది. ఏపీ పారిశ్రామిక ప్రస్థానంలో ఆర్సెలార్ మిట్టల్ - నిప్పాన్ స్టీల్ ఇండియా ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలవబోతుంది.
మహానుభావుడు, త్యాగశీలి అమరజీవి పొట్టి శ్రీరాములు అని హోంమంత్రి అనిత అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి హోంమంత్రి నివాళులర్పించారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేపట్టిన ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండా’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే విజయ్ కుమార్ అభినందించారు. ప్రజల సమస్యలను నేరుగా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావడంలో ఇలాంటి వేదికలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.
అనకాపల్లి మండలం ఏటికొప్పాక సమీపంలో వరాహ నదీ వద్ద బాలుడు ఆడారి వెంకట్ కౌశిక్ మృతి కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. మైనర్ బాలుడి చేతిలోని నాటు తుపాకీ పేలడంతోనే కౌశిక్ మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు.