Home » Amit Shah
నిన్నటి వరకూ బీజేపీ అగ్రనేతల అపాయింట్‌మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నించి, అది కుదరక తీవ్ర మనస్తాపంతో వున్న మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే బహిష్కృతనేత ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్) తాజాగా తన అక్కసు వెళ్లగక్కారు.
పహల్గాం మారణకాండలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను మన భద్రతా బలగాలు హతమార్చాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూకశ్మీరు పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ మహాదేవ్‌లో ఉగ్రవాదులను కాల్చి చంపినట్లు వెల్లడించారు.
ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఓటర్ ఐడీ కార్డులు, చాకొలెట్ రేపర్లు పాకిస్థాన్‌లో తయారైనవేనని అమిత్‌షా చెప్పారు. ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడిపై రెండోరోజు మంగళవారంనాడు జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ చేపట్టిన ఆపరేషన్‌పై విపక్షాలు సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తారనుకుంటే.. సందేహాలు వ్యక్తం చేస్తున్నారంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. లోక్‌సభలో రెండో రోజు మంగళవారం జరిగిన ప్రత్యేక చర్చలో అమిత్ షా మాట్లాడారు.
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై జరిగిన చర్చలో జైశంకర్ మాట్లాడుతుండగా విపక్ష సభ్యులు పలుమార్లు అంతరాయం కలిగించారు. దీంతో అమిత్‌షా జోక్యం చేసుకుంటూ.. మీ సొంత విదేశాంగ మంత్రినే మీరు నమ్మరా' అంటూ విపక్షాలపై మండిపడ్డారు.
తాను మళ్లీ బీజేపీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నానని, అమిత్ షా తనకు ఫోన్ చేశారని జరుగుతున్న ప్రచారం నిజం కాదని ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు.
ఇటీవల కాలంలో వివాదాల్లో చిక్కుకున్న సుమారు డజను మంది మంత్రులు, సహాయ మంత్రులకు ఈసారి మంత్రివర్గ పునర్వవస్థీకరణలో ఉద్వాసన తప్పకపోవచ్చని శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ చెప్పారు.
రాష్ట్ర బీజేపీ నేతల మధ్య ఉన్న సమస్యలను తాము చూసుకుంటామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు ఈ సాయంత్రం ఢిల్లీలో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులపై ఇరువురు మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. పోలవరం, బనకచర్లపై..
ప్రకృతి వ్యవసాయం సైన్స్ ఆధారిత టెక్నిక్ అని, చాలా ప్రయోజనాలు ఉంటాయని అమిత్‌షా చెప్పారు. కెమికల్ ఫెర్టిలైజర్స్‌తో పెరిగే గోధుమలతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని అన్నారు.