Home » America
ఈ మధ్య కాలంలో భారత్-అమెరికా సంబంధాలు కొంత గందరగోళంలో పడినట్టు కనిపిస్తోంది. ఇందుకు కారణం ట్రంప్ ప్రభుత్వం భారత ఎగుమతులపై 50 శాతం టారిఫ్‌లు విధించడం. ఈ నేపథ్యంలో అమెరికాలో ప్రముఖ రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ ఇరు దేశాలు తిరిగి సంబంధాలను బలోపేతం చేసుకోవాలని సూచించారు.
ఇండియా పోస్ట్ నుంచి ఒక కీలక అప్డేట్ వచ్చింది. మీరు అమెరికాకు ఏదైనా పార్సల్ లేదా లెటర్ పంపాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈ వార్త మీరు తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే అమెరికాకు పోస్టల్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. ఎందుకు, ఎప్పటి నుంచనే చేయాలనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
TANA Flag Hoisted On Mount Elbrus: అమెరికాలో మొట్టమొదటిసారిగా వాల్మీకి రామాయణం తెలుగులో బోధించడానికి తానా సన్నాహాలను పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ పతాకాన్ని ఎగురవేశారు. తానా శ్రీకారం చుట్టిన గొప్ప కార్యక్రమం అందరి దృష్టిలో పడేలా చేశారు.
అమెరికాలోని న్యూయార్క్‌లో ఓ టూరిస్టు బస్సు అదుపు తప్పి పల్టీ కొట్టడంతో ఐదుగురు దుర్మరణం చెందారు. ప్రమాద సమయంలో బస్సులో భారతీయులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.
భారత్‌తో వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌కు రాయబారిగా తనకు సన్నిహితుడైన సెర్గియో గోర్‌ను నియమించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవల తీవ్ర విమర్శలు చేసిన ఆయన మాజీ సలహాదారు జాన్ బోల్టన్‌పై అమెరికా అత్యున్నత దర్యాప్తు ...
అమెరికాలోని వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్ సర్కారు.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అక్కడ ఉంటున్న 5.5 కోట్ల మందికి పైగా విదేశీయుల వీసా పత్రాలను సమీక్షించనున్నట్లు ప్రకటించింది..
Massive Brawl Over Chicken: చికెన్ విషయంలో ప్రయాణికుల మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ చినికి చినికి గాలి వానలా తయారైంది. ప్రయాణికులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటం మొదలెట్టారు.
ట్రక్ డ్రైవర్‌లకు వర్కర్ వీసాల జారీని నిలిపివేస్తున్నట్టు ట్రంప్ సర్కారు తాజాగా ప్రకటించింది. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు, అమెరికన్ల ఉపాధిని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ఓ ప్రకటనలో తెలిపారు.
చైనా రాయబారి జు ఫీహాంగ్ అమెరికా విషయంలో చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఓవైపు అమెరికాను విమర్శిస్తూనే, భారతదేశానికి చైనా అండగా ఉంటుందని ప్రకటించారు.