Share News

Enough Nuclear Weapons: అమెరికా దగ్గర అణుబాంబులు.. ప్రపంచాన్ని 150 సార్లు ధ్వంసం చేయగలమన్న ట్రంప్..

ABN , Publish Date - Nov 07 , 2025 | 04:55 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దగ్గర ఉన్న అణుబాంబుల గురించి మాట్లాడారు. అన్ని దేశాలకంటే తమ దగ్గరే ఎక్కువ అణుబాంబులు ఉన్నాయని అన్నారు. వాటితో ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు ధ్వంసం చేయగలమని చెప్పారు.

Enough Nuclear Weapons: అమెరికా దగ్గర అణుబాంబులు.. ప్రపంచాన్ని 150 సార్లు ధ్వంసం చేయగలమన్న ట్రంప్..
Enough Nuclear Weapons

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అణు బాంబులు కలిగిన దేశాల్లో తామే నెంబర్ వన్ అని ఆయన అన్నారు. తమ దగ్గర ఉన్న అణుబాంబులతో ప్రపంచాన్ని 150 సార్లు ధ్వంసం చేయగలమని చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే.. ‘అణుబాంబులు కలిగిన దేశాల్లో మేమే నెంబర్ వన్. రష్యా నెంబర్ 2, చైనా నెంబర్ 3. మరో నాలుగైదు ఏళ్లలో వాళ్లు ఇంతకంటే కిందకు దిగజారవచ్చు.


దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నేను రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్‌తో మాట్లాడాను. అణుబాంబులు అవసరం లేదని చెప్పాను. దాని కోసం ఖర్చు చేసే డబ్బుల్ని వేరే వాటికి ఉపయోగించుకోవచ్చు. మా దగ్గర ఉన్న అణుబాంబులతో మేము ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు ధ్వంసం చేయగలము. నాకు ప్రపంచ వ్యాప్తంగా శాంతి కావాలి’ అని అన్నారు. పెంటగాన్ మళ్లీ ఆయుధాల ట్రైల్స్ మొదలు పెట్టడంపై కూడా ఆయన మాట్లాడారు.


‘ఆ విషయం మున్ముందు మీకే తెలుస్తుంది. మేము కొన్ని ట్రైల్స్ అయితే చేయబోతున్నాం. మిగితా దేశాలు అదే చేస్తున్నాయి. వాళ్లు చేసినపుడు మేము చేయలేమా? మేము కూడా చేస్తాం. ఆ విషయాలు ఇక్కడ చెప్పలేను. అందరి కంటే ఎక్కువ అణుబాంబులు మా దగ్గరే ఉన్నాయి. మేము టెస్టింగ్ చేయటాన్ని ఎప్పుడో ఆపేశాం. మిగితా వాళ్లు చేస్తూనే ఉన్నారు. అలాంటప్పుడు మేము కూడా చేస్తాం’ అని స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి

నెల రోజుల పాటు గుడ్డు తిన్నారంటే జరిగేదిదే..

మరీ ఇంత దారుణమా.. చిత్తు కాగితాల్లో పిల్లలకు భోజనం..

Updated Date - Nov 07 , 2025 | 05:08 PM