Trump-India: రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోళ్లను భారీగా తగ్గించింది: ట్రంప్
ABN , Publish Date - Nov 07 , 2025 | 07:22 AM
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది భారత్ పర్యటనకు రాబోతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మంచి మిత్రుడని చెప్పిన ట్రంప్.. భారత్‌తో వాణిజ్య చర్చలు అద్భుతంగా సాగుతున్నాయని..
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది భారత్ పర్యటనకు రాబోతున్నారు. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మంచి మిత్రుడని చెప్పిన ట్రంప్.. భారత్‌తో వాణిజ్య చర్చలు అద్భుతంగా సాగుతున్నాయన్నారు.
త్వరలో భారత్-అమెరికా వాణిజ్య చర్చలు కొలిక్కివస్తాయని ట్రంప్ తెలిపారు. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోళ్లను భారీగా తగ్గించిందని కూడా ట్రంప్ ఈ సందర్భంగా తెలిపారు. ఇరు దేశాల వ్యాపార ఒప్పందాల నేపథ్యంలో తాను త్వరలో భారత్‌ను సందర్శిస్తానని ట్రంప్ స్పష్టం చేశారు.
వాషింగ్టన్ డీసీలోని తన అధికారిక ఓవల్ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ట్రంప్, భారత ప్రధాని మోదీ గొప్ప మిత్రుడని, మహానుభావుడని కీర్తించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు భారత్ దాదాపు ఆపేసిందని, ఇది తన ఒత్తిడికి ఫలితమని కూడా ట్రంప్ అన్నారు. ఇలా ఉండగా, రష్యా నుంచి చమురు కొనుగోలు కారణంగా అమెరికా విధించిన 50 శాతం టారిఫ్‌ల నేపథ్యంలో రెండు దేశాలు మార్చి నుంచి ద్వైపాక్షిక వ్యాపార ఒప్పందం (BTA) కోసం ఇప్పటికి ఐదు రౌండ్ల చర్చలు జరిపాయి.
ఇవి కూడా చదవండి:
Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి ఆదేశాలు
Agriculture Minister: పరిహారమిచ్చినా ధాన్యం కొంటాం