Share News

Stree For Halloween: అమెరికా రోడ్లపై స్త్రీ .. వైరల్‌గా మారిన వీడియో..

ABN , Publish Date - Nov 03 , 2025 | 03:59 PM

ఇండియానాలో నివసిస్తున్న ఇండియాకు చెందిన ఓ యువతి ‘స్త్రీ’ సినిమాలోని స్త్రీ వేషం ధరించింది. ఆ వేషంతో వీధుల్లో తిరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

Stree For Halloween: అమెరికా రోడ్లపై స్త్రీ .. వైరల్‌గా మారిన వీడియో..
Stree For Halloween

నైంటీస్ కిడ్స్‌కు ‘ఓ స్త్రీ రేపు రా’ గురించి చెప్పాల్సిన పని లేదు. 10 ఏళ్ల క్రితం గ్రామాల్లోని చాలా ఇళ్ల బయట ‘ఓ స్త్రీ రేపు రా’ అని రాసేవారు. ఓ ఆడ దెయ్యం రాత్రిళ్లు ఊరిలో తిరుగుతోందని, ఇంటి తలుపులు తట్టి మరీ చంపుతోందని ప్రచారం జరిగింది. దీంతో జనం ఇళ్ల బయట ‘ఓ స్త్రీ రేపు రా’ అని రాసుకునే వారు. ఇదే కాన్సెప్ట్‌తో బాలీవుడ్‌లో ‘స్త్రీ‘ అనే సినిమా వచ్చింది. 2018లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది.


2024లో ‘స్త్రీ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. దేశం ఈ మూల నుంచి ఆ మూల వరకు హర్రర్ కామెడీ ఇష్టపడే వారిని ఈ రెండు సినిమాలు బాగా మెప్పించాయి. ఇందులో నటించిన వారికి మంచి గుర్తింపు తెచ్చాయి. ఇక, అసలు విషయానికి వస్తే.. అమెరికాలో ‘హాలోవీన్’ పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పండుగ సంబరాల్లో భాగంగా జనం దెయ్యాల వేషాల్లో సందడి చేశారు.


ఈ నేపథ్యంలోనే ఇండియానాలో నివసిస్తున్న ఇండియాకు చెందిన ఓ యువతి ‘స్త్రీ’ సినిమాలోని స్త్రీ వేషం ధరించింది. ఆ వేషంతో వీధుల్లో తిరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ స్త్రీ ఇప్పుడు ఎన్ఆర్ఐ అయిపోయింది’..‘ఎలాంటి ఇబ్బంది లేకుండా స్త్రీ హెచ్ 1బీ వీసా తెచ్చేసుకుంది’..‘స్త్రీ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది’ అంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ప్రెగ్నెంట్ చేస్తే పాతిక లక్షలు ఇస్తామన్నారు.. చివరికి ఏం జరిగిందో తెలిస్తే..

పప్పు, తప్పు, అప్పు.. ఇండియా కూటమి నేతలపై యోగి సెటైర్లు

Updated Date - Nov 03 , 2025 | 04:03 PM