Home » America
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ 1 బీ వీసాల విషయంలో క్రూరమైన నిర్ణయం తీసుకున్నారు. వీసాల దరఖాస్తు రుసుమును భారీగా పెంచేశారు. హెచ్ 1బీ వీసా పొందాలనుకునే వారు ఏకంగా లక్ష డాలర్లు చెల్లించాలని స్పష్టం చేశారు.
అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులకు పిడుగులాంటి వార్త. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. హెచ్1 బీ వీసాపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై భారత్-అమెరికా తొలి రౌండ్ చర్చలు ముగియడంతో ఎంఈఏ తాజా ప్రకటన చేసింది. భారత్ వస్తువులపై అమెరికా 50 శాతం సుంకం విధించిన అనంతరం ఇరుదేశాల మధ్య చర్చలు జరగడం ఇదే మొదటిసారి.
అణుకార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడి చాబహార్ పోర్టులో కార్యకలాపాలు నిర్వహించేందుకు భారత్, సహా పలు దేశాలకు గతంలో ఇచ్చిన మినహాయింపులను తాజాగా ఉపసంహరించుకుంది.
అమెరికాలో ప్రముఖ టీవీ షో జిమ్మీ కిమ్మెల్ లైవ్ ప్రసారం నిలిచిపోయింది. కిర్క్ హత్య గురించి షో వ్యాఖ్యాత జిమ్మీ కిమ్మెల్ అభ్యంతరకర కామెంట్స్ చేసిన నేపథ్యంలో షో ప్రసారాన్ని నిలిపివేస్తున్నట్టు ఏబీసీ టీవీ సంస్థ ప్రకటించింది.
అమెరికాలోని పెన్సిల్వేనియాలో బుధవారం వెలుగు చూసిన కాల్పుల ఘటనలో ముగ్గురు పోలీసులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. నార్త్ కొరొడస్న్‌టైన్‌షిప్‌లో ఈ ఘటన జరిగింది.
ఢిల్లీలో భారత్-అమెరికా మధ్య నిన్న జరిగిన వాణిజ్య చర్చలు సానుకూలంగా ముగిశాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల ప్రయోజనాల కోసం త్వరలోనే ఒప్పందం గురించి చర్యలు తీసుకుంటామని వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఈరోజు మళ్లీ ప్రారంభం కానున్నాయి. న్యూఢిల్లీలో జరిగే ఈ చర్చలు ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలు, వాణిజ్య సంబంధాలను తిరిగి బలోపేతం చేయాలనే లక్ష్యంగా జరగనున్నాయి.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంగా భారత్ ఎగుమతులపై ట్రంప్ 50 శాతం సుంకాల భారం విధించడంతో ఇరుదేశాల సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రతినిధి భారత్‌కు రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
దక్షిణ కొరియా హెచ్చరికలతో ట్రంప్ వెనక్కు తగ్గారు. అమెరికాలో విదేశీ వర్కర్లకు జాబ్స్ ఇవ్వొచ్చంటూ సోషల్ మీడియాలో ప్రకటించారు. విదేశీ వర్కర్ల నుంచి అమెరికన్లు నేర్చుకునేది ఎంతో ఉందని కూడా అన్నారు.