H-1B visa: హెచ్1బీ వీసాదారులకు కొత్త రూల్.. వీసా అపాయింట్‌మెంట్స్ వాయిదా..
ABN , Publish Date - Dec 10 , 2025 | 10:09 AM
హెచ్1బీ వీసాకు దరఖాస్తు చేసుకునే విదేశీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తీసుకోవాలనుకునే హెచ్4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాల గురించి అమెరికా విదేశాంగ శాఖ కొత్త నిబంధనను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
హెచ్1బీ వీసాకు దరఖాస్తు చేసుకునే విదేశీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తీసుకోవాలనుకునే హెచ్4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాల గురించి అమెరికా విదేశాంగ శాఖ కొత్త నిబంధనను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. హెచ్4 వీసా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ఖాతాలను పబ్లిక్ సెట్టింగ్‌లో ఉంచాలని అమెరికా కొత్త రూల్ తీసుకొచ్చింది (visa appointments postponed).
డిసెంబర్ 15వ తేదీ నుంచి దరఖాస్తుదారుల అందరి సోషల్ మీడియా ఖాతాలను అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ పరిశీలించనుంది. ఈ కారణంగా అనేక మంది వీసా అపాయింట్‌మెంట్లు వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం మంగళవారం రాత్రి వీసా దరఖాస్తుదారులకు ఒక సూచన జారీ చేసింది. 'మీ వీసా అపాయింట్‌మెంట్ రీషెడ్యూల్ అయిందని మీకు ఈ-మెయిల్ అందితే, మీ కొత్త అపాయింట్‌మెంట్ తేదీలో మీకు సహాయం చేయడానికి మిషన్ ఇండియా ఎదురుచూస్తోంది' అని పేర్కొంది (US consulate India).
గతంలో షెడ్యూల్ చేసిన ఇంటర్వ్యూ తేదీన కాన్సులేట్‌కు వచ్చే వీసాదారులకు రీ-షెడ్యూల్ గురించి తెలియజేస్తామని, అయితే కార్యాలయం లోపలికి మాత్రం ప్రవేశం ఉండదని అమెరికా ఎంబసీ స్పష్టం చేసింది (US visa delays). డిసెంబర్ 15 నుంచి 30 వరకు జరగాల్సిన ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది మార్చికి వాయిదా వేస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. పూర్తి వివరాలు వ్యక్తిగత ఈ-మెయిల్ ఖాతాలకు వస్తాయి. వీసా దరఖాస్తుదారులలో అమెరికా జాతీయ భద్రతకు లేదా ప్రజా భద్రతకు ముప్పు కలిగించే వారిని గుర్తించడానికి అధికారులు డిసెంబర్ 15 నుండి వారి ఆన్‌లైన్ పోస్ట్‌లను సమీక్షిస్తారు.
ఇవి కూడా చదవండి
జీఎంహెచ్ఎంసీ వార్డుల సంఖ్య పెంపు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
రో-కో ఇంకా ఏం నిరూపించుకోవాలి?: అశ్విన్