Kidney From Donor: ఇది కదా విషాదం అంటే.. ఆ దాత నుంచి కిడ్నీ తీసుకున్న వారాలకే..
ABN , Publish Date - Dec 11 , 2025 | 10:58 AM
ఓ వ్యక్తి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జర్నీ విషాదంగా ముగిసింది. దాత నుంచి కిడ్నీ తీసుకున్న 5 వారాలకే గ్రహీత దారుణమైన వ్యాధి బారినపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
దాత నుంచి కిడ్నీ తీసుకోవటమే ఓ వ్యక్తికి శాపంగా మారింది. కిడ్నీ తీసుకున్న కొన్ని రోజులకే ఓ దారుణమైన వ్యాధితో కిడ్నీ గ్రహీత ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓహియోకు చెందిన ఐడాహో మ్యాన్ అనే వ్యక్తికి 2024 డిసెంబర్ నెలలో స్కంక్ అనే జీవి కరిచింది. స్కంక్ కరిచిన కొన్ని వారాలకే ఐడాహోకు రేబిస్ వ్యాధి సోకింది. రేబిస్ లక్షణాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న అతడ్ని కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చేరిన రెండు రోజుల తర్వాత అతడి పరిస్థితి దారుణంగా తయారైంది.
అతడ్ని కాపాడాలనుకున్న డాక్టర్ల ప్రయత్నాలు ఫలించలేదు. ఐడాహోకు బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో కుటుంబసభ్యులు అతడి అవయవాలను డొనేట్ చేశారు. ఐడాహో కిడ్నీని డాక్టర్లు అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి అమర్చారు. కిడ్నీ తీసుకున్న 5 వారాల తర్వాత గ్రహీతకు రేబీస్ వ్యాధి సోకింది. శరీరం మొత్తం వణకటం, నిస్సత్తువ, కన్‌ఫ్యూజన్‌తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడసాగాడు. కొద్దిరోజులకే ఊహించని విధంగా అతడు చనిపోయాడు. పోస్టుమార్టం రిపోర్టులో రేబీస్ వ్యాధి కారణంగా అతడు చనిపోయినట్లు తేలింది. ఈ సంఘటనపై డాక్టర్ లారా డంజిగర్ మాట్లాడుతూ.. ‘ఇది అత్యంత అరుదైన సంఘటన’ అని అన్నారు.
డాక్టర్ల పొరపాటు కారణంగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఐడాహోకు రేబీస్ ఉందని డాక్టర్లు అనుకోలేదు. అతడికి ఉన్న లక్షణాలను క్రోనిక్ మెడికల్ కండీషన్ అని అనుకున్నారు. సాధారణంగా ఒకరి శరీర అవయవాలను మరొకరికి డొనేట్ చేసే ముందు హెచ్ఐవీ, హెపటైటిస్ బీ వంటి వ్యాధులకు మాత్రమే టెస్టులు చేస్తారు. రేబీస్ వ్యాధి టెస్టులు చేయరు. అదే ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఐడాహో శరీర అవయవాలను చనిపోయిన వ్యక్తితో పాటు మరో ముగ్గురికి ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. కిడ్నీ తీసుకున్న వ్యక్తి చనిపోగానే మిగిలిన వారిని వైద్యులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే, వారిలో ఎవ్వరికీ కూడా రేబీస్ వ్యాధి లక్షణాలు లేకపోవటం గమనార్హం.
ఇవి కూడా చదవండి
బంగారం ధర తగ్గింది.. వెండి ధర పెరిగింది..
ఏపీ మంత్రిమండలి భేటీ ప్రారంభం.. 44 అంశాలపై కీలక చర్చ