Share News

Trumps India Tariffs: ట్రంప్‌కు బిగ్ షాక్.. 50 శాతం టారీఫ్‌లకు వ్యతిరేకంగా తీర్మానం..

ABN , Publish Date - Dec 13 , 2025 | 09:21 AM

భారత్‌పై విధించిన 50 శాతం టారీఫ్‌లను రద్దు చేయాలంటూ ముగ్గురు ప్రజా ప్రతినిధులు అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం ప్రవేశ పెట్టారు. శుక్రవారం డెబోరా రాస్, మార్క్ వీసే, రాజా క్రిష్ణమూర్తిలు తీర్మానం ప్రవేశపెట్టారు.

Trumps India Tariffs: ట్రంప్‌కు బిగ్ షాక్.. 50 శాతం టారీఫ్‌లకు వ్యతిరేకంగా తీర్మానం..
Trump India tariffs

న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై ఒకరకంగా కక్ష గట్టారు. భారత్ ‌నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై భారీ సంఖ్యలో టారీఫ్‌లు వేస్తూ ఉన్నారు. భారత్‌పై ప్రస్తుతం 50 శాతం టారీఫ్‌లు కొనసాగుతున్నాయి. ఈ టారీఫ్‌ల కారణంగా భారత్ పెద్ద మొత్తంలో ఆదాయాన్ని కోల్పోతూ ఉంది. కేవలం భారత్ మాత్రమే కాదు అమెరికాపై కూడా టారీఫ్‌ల ప్రభావం పడుతోంది. అయినా ట్రంప్ మారటం లేదు. ఈ సారి ఏకంగా అమెరికా దిగుమతి చేసుకుంటున్న బియ్యాన్ని ఆయన టార్గెట్ చేశారు. స్థానిక రైతులకు మేలు చేయటం కోసం భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న బియ్యంపై భారీ మొత్తంలో టారీఫ్‌లు విధించాలని ట్రంప్ డిసైడ్ అయ్యారు.


50 శాతం టారీఫ్‌లకు వ్యతిరేకంగా తీర్మానం..

డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ తలిగింది. భారత్‌పై విధించిన 50 శాతం టారీఫ్‌లను రద్దు చేయాలంటూ ముగ్గురు ప్రజా ప్రతినిధులు అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం ప్రవేశ పెట్టారు. శుక్రవారం డెబోరా రాస్, మార్క్ వీసే, రాజా క్రిష్ణమూర్తిలు అధ్యక్షుడు ట్రంప్‌ జాతీయ అత్యవసర ప్రకటనను రద్దు చేసే లక్ష్యంతో ఆ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ట్రంప్ చర్యలు చట్ట విరుద్ధమని ఆ ముగ్గురు సభ్యులు పేర్కొన్నారు. 2025, ఆగస్టు 27వ తేదీన ట్రంప్ ప్రభుత్వం అదనంగా 25 శాతం టారీఫ్‌లు వేసిన సంగతి తెలిసిందే. డెబోరా రాస్, మార్క్ వీసే, రాజా క్రిష్ణమూర్తిలు ఈ అదనపు 25 శాతం టారీఫ్‌లను ప్రత్యేక లక్ష్యంగా చేసుకుని తీర్మానం ప్రవేశపెట్టారు.


అది నిజంగా సిగ్గుచేటు..

భారత్‌, చైనా వంటి దేశాల నుంచి వచ్చి అమెరికాలోని అత్యుత్తమ కాలేజీల్లో చదువుకున్న ప్రతిభావంతులైన విద్యార్థులను తిరిగి స్వదేశాలకు వెళ్లనివ్వటం సిగ్గుచేటని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. అలాంటి విద్యార్థులకు అమెరికన్‌ కంపెనీలు ఉద్యోగాలిచ్చి అమెరికాకే సేవలందించేలా చర్యలు తీసుకోవాలని అమెరికాలోని టాప్‌ కంపెనీల సీఈఓలకు సూచించారు. పలు కంపెనీల సీఈవోలతో బుధవారం ఆయన అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘ట్రంప్‌ గోల్డ్ కార్డు’లను విడుదల చేశారు.


ఇవి కూడా చదవండి

గావస్కర్ వ్యక్తిత్వ హక్కులపై పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు

జనవరి 4 నుంచి ‘సంక్రాంతి’ ప్రత్యేక రైళ్లు..

Updated Date - Dec 13 , 2025 | 09:47 AM