Home » Amaravati
గతంలో రూ.7 కోట్లు ఆదాయం వచ్చే చోట ఇప్పుడు ప్రభుత్వం ఎదురు చెల్లించాల్సి వస్తున్న పరిస్థితులను ఎలా అధిగమించాలనే విషయంపై సబ్ కమిటీ చర్చించింది.
కల్తీ లిక్కర్ తయారీని ఉపేక్షించొద్దని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రమంతటా.. నకిలీ మద్యం అని తప్పుడు ప్రచారంతో ప్రజలను భయపెడుతున్నారని పేర్కొన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. తమిళులు అత్యంత పెరటాశి మాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. తమ స్వగ్రామాల నుంచే తిరుమలకు కాలినడకన చేరుకుని స్వామిని దర్శించుకునే సంప్రదాయం ఉంది.
మానవత్వమే సిగ్గుపడే దృశ్యం ఇది. తిరుపతి రుయా ఆసుపత్రికి ఎదురుగా ఇస్కాన్ రోడ్డులోని బస్టా్‌పలో బతికున్న శవాల్లా పడివున్నారు వీరంతా. ఎవరో తెలీదు. ఎక్కడి నుంచి ఎలా వచ్చారో తెలీదు. ఎప్పుడొచ్చి ఈ నీడకు చేరారో ఏమో.. మూలుగుతూ ముక్కుతూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు.
నాటు కోడి కంటపడితే మాయం చేసేస్తున్నారు ఇద్దరు యువకులు. తెలిసినవాళ్లు ఫోన్ చేసి.. ‘రేయ్ మామా.. కోడి..’ అని అడిగిందే తడవు సరఫరా చేస్తున్నారు. వీరి దెబ్బకు ఇళ్ల వద్ద నాటు కోళ్లను పెంచుకునేవారు బెంబేలెత్తిపోతున్నారు.
తిరుపతిలో రౌడీ కల్చర్ కోరలు చాచింది. ఓ రౌడీ మద్యం మత్తులో కత్తితో వీరంగం చేస్తూ నడిరోడ్డుపై సోమవారం జనాలను భయభ్రాంతులకు గురిచేశాడు. ఇతడితోపాటు ప్రత్యర్థినీ పోలీసులు అదుపులోకి తీసుకుని వీధిలో నడిపించుకుంటూ తీసుకెళ్లారు.
పులపత్తూరుకు సమీపంలో బాహుదానది ఆనుకుని అటవీ ప్రాంతంలో ఏకిరిపల్లె గ్రామం ఉంది. వీరు అడవిలో లభించే అటవీ వస్తువులను నమ్ముకుని గతంలో జీవనం సాగించేవారు. రాను రాను అటవీ ప్రాంతంలో ఉన్న మెట్ట ప్రాంత భూములను చదును చేసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
‘దసరా’, ‘దీపావళి’ పండగలని తెలుసు. దేశవ్యాప్తంగా కొన్ని ఊర్ల పేర్లు గమ్మత్తుగా ఉన్నట్టే... ఆశ్చర్యంగా ఒక ఊరి పేరు ‘దీపావళి’. అది కూడా ఎక్కడో కాదు... మన దగ్గరే. దేశవ్యాప్తంగా ఈ పేరుతో ఉన్న ఒకే ఒక్క ఊరు అది... ఇంతకీ ఎక్కడుంది? ఏమా కథ??
అమరావతిలోని సీఆర్డీఏ భవన పనులు నత్తనడకన కొనసాగుతోండటంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రసారమైంది. ఈ కథనంతో అధికారులు స్పందించి సీఆర్డీఏ భవన పనులు వేగంగా చేపట్టాలని ఆదేశించారు. అధికారుల ఆదేశాలతో ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం లభించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం ఏపీ సచివాలయంలో మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేబినెట్‌తో చర్చించారు సీఎం చంద్రబాబు.