SP Jagadeesh: న్యూ ఇయర్ వేడుకల్లో హద్దుమీరితే ఇక..
ABN , Publish Date - Dec 31 , 2025 | 12:08 PM
నూతన సంవత్సర వేడుకల్లో హద్దుమీరితే చర్యలుంటాయని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ అన్నారు. ఆయన మాట్లాడుతూ... అనంతపురం నగరంతోపాటు అన్ని మున్సిపాలిటీలు, పట్టణాలు, మండలాల్లో ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు.
- ప్రశాంతంగా న్యూ ఇయర్ జరుపుకోండి: ఎస్పీ
అనంతపురం: ఆంగ్ల నూతన ఏడాది వేడుకలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని, 31న అర్ధరాత్రి 1 గంట వరకూ మాత్రమే అనుమతి ఉంటుందని ఎస్పీ జగదీష్(SP Jagadeesh) పేర్కొన్నారు. టపాసులు, డీజేలు నిషేధమని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. న్యూ ఇయర్- 2026 వేడుకలు ప్రజలు ఇళ్లలోనే ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. జాగ్రత్తలు పాటిస్తూ...ప్రమాదాలకు దూరంగా ఉండాలన్నారు. అనంతపురం నగరంతోపాటు అన్ని మున్సిపాలిటీలు, పట్టణాలు, మండలాల్లో ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు.

జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఉంటుందని తెలిపారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమరాల పర్యవేక్షణ ఉంటుందన్నారు. మద్యం దుకాణాలు నిర్ణీత సమయానికి మూసివేయాలన్నారు. ఎవరూ రహదారులను బ్లాక్ చేసి వేడుకలు నిర్వహించవద్దన్నారు. ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్ తొలగించి వాహనాలు నడపడం వంటి కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కల్తీ నెయ్యి కేసులో వేమిరెడ్డి ప్రశాంతి విచారణ
మద్దతు ధరకు పప్పుధాన్యాల కొనుగోలు
Read Latest Telangana News and National News