Share News

MLA: ఎమ్మెల్యే సంచలన కామెంట్స్.. వైసీపీ నేతల కంటే మావోయిస్టులే నయం

ABN , Publish Date - Jan 01 , 2026 | 01:22 PM

విజయనగరం జిల్లా చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల కంటే మావోయిస్టులే నయం.. అంటూ పేర్కొన్నారు. జిల్లాలోనేగాక రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తల అరాచకాలు పెరిగిపోతున్నాయన్నారు.

MLA: ఎమ్మెల్యే సంచలన కామెంట్స్.. వైసీపీ నేతల కంటే మావోయిస్టులే నయం

- కంపెనీల యాజమానులు, కాంట్రాక్టర్లకు బెదిరింపులా?: కళా వెంకట్రావు

విజయనగరం: ‘వైసీపీ నేతల కంటే మావోయిస్టులే నయం. వారు సిద్ధాంతం కోసం పోరాడితే, వైసీపీ నాయకులకు సిద్ధాంతమే లేదు. కేవలం బెదిరింపులకు పాల్పడడమే వారి లక్ష్యం’ అని టీడీపీ సీనియర్‌ నేత, చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావు(Cheepurupalli MLA Kala Venkata Rao) ధ్వజమెత్తారు. విజయనగరం జడ్పీ అతిథి గృహంలో బుధవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.


nani3.2.jpg

మాజీ సీఎం జగన్‌, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana)పై నిప్పులు చెరిగారు. పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాలల నిర్మాణ, నిర్వహణకు ముందుకు వచ్చిన వారిని, అభివృద్ధి పనులు చేయడానికి ఆసక్తి చూపుతున్న కాంట్రాక్టర్లను బెదిరిస్తూ రాజ్యాంగేతర శక్తులుగా తయారయ్యారని మండిపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'కల్కి-2' షూటింగ్‌కు డార్లింగ్!

రానూపోనూ టికెట్లు బుక్‌ చేస్తే 10శాతం రాయితీ

Read Latest Telangana News and National News

Updated Date - Jan 01 , 2026 | 01:22 PM