Home » Airport
భారత విమానయాన రంగంలో మరో కీలక మలుపు. ప్రధాని మోదీ అక్టోబర్ 8, 2025న నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించబోతున్నారు. దీంతో ముంబై.. లండన్, న్యూయార్క్, టోక్యోలతో జతచేరుతుంది.
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఇవాళ(ఆదివారం) బాంబు బెదిరింపు చేశారు దుండగులు. బాంబు ఉందంటూ ఈమెయిల్ పంపించారు దుండగులు. ఎయిర్పోర్టులో సెక్యూరిటీ సిబ్బంది ముమ్మర తనిఖీలు నిర్వహించారు.
తెలంగాణతో పాటు హైదరాబాద్లో కూడా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు విమానాలను దారి మళ్లిస్తున్నట్లు శంషాబాద్ ఎయిర్పోర్టు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో ఖరీదైన హైడ్రోపోనిక్ గంజాయి పట్టుబడింది. DRI అధికారులు నిర్వహించిన సోదాల్లో మొత్తం..
విహార యాత్రలో భాగంగా నేపాల్ వెళ్లారు. అక్కడ నెలకొన్న అలర్ల నేపథ్యంలో ఏర్పడిన తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల్లో చిక్కుకున్నారు. తిరిగి ఇళ్లు చేరగలమా అని ఆందోళన చెందారు. అలాంటి వారికి ప్రభుత్వం అండగా నిలిచింది. నేపాల్ నుంచి రప్పించింది.
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కౌలాలంపూర్ నుంచి చైన్నై వచ్చిన ప్రయాణికులు ఎయిర్పోర్టులో బయటికి వెళ్లే క్రమంలో ఓ జంటను చూడగానే అధికారులకు అనుమానం కలిగింది. చివరకు క్షుణ్ణంగా పరిశీలించగా.. షాకింగ్ సీన్ కనిపించింది..
శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటోంది. దూర ప్రాంతాల ప్రయాణికులు విమానం దిగిన వెంటనే పుష్పక్ బస్సులో సమీపంలోని ఆర్జీఐఏ బోర్డింగ్ పాయింట్కి వెళ్లి అక్కడ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో శ్రీశైలం వెళ్లొచ్చని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
టెర్మినల్స్, పార్కింగ్ ఏరియాలు, పెరీమీటర్ జోన్లు, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో పెట్రోలింగ్ పెంచుతూ 24 గంటలూ అప్రమత్తతను పాటించాలని, స్థానిక పోలీసుల సమన్వయంతో సిటీసైడ్ సెక్యూరిటీ చర్యలను ఎయిర్పోర్ట్లు చేపట్టాలని కేంద్ర పౌర విమానయాన భదత్రా బ్యూరో సూచించింది. అంతర్జాతీయ, దేశీయ మార్గాల్లో పంపే మెయిల్ పార్సిళ్లను క్షుణ్ణంగా సోదా చేయాలని, సిబ్బంది, కాంట్రాక్టర్లు, విజిటర్లను కూడా తనిఖీలు చేయాలని అప్రమత్తం చేసింది.
శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ లో ఒక సీనియర్ ఆర్మీ అధికారి రెచ్చిపోయాడు. స్పైస్ జెట్ విమాన సిబ్బందిని చితక్కొట్టాడు. దీంతో నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. కొందరు వెన్నులు విరిగిపోయి, మరికొందరు గాయాలతో ఆస్పత్రిలో చేరారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు నిఘా వర్గాల అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఆగస్టు 15వ తేదీను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.