Share News

Hyderabad Airport Drug Seizure: 12 కోట్ల గంజాయి.. మహిళా ప్రయాణికురాలు అరెస్ట్..

ABN , Publish Date - Sep 20 , 2025 | 03:31 PM

హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో ఖరీదైన హైడ్రోపోనిక్ గంజాయి పట్టుబడింది. DRI అధికారులు నిర్వహించిన సోదాల్లో మొత్తం..

Hyderabad Airport Drug Seizure: 12 కోట్ల  గంజాయి..  మహిళా ప్రయాణికురాలు అరెస్ట్..
Hyderabad Airport Drug Seizure

హైదరాబాద్ : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో భారీగా ఖరీదైన హైడ్రోపోనిక్ గంజాయి పట్టుబడింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ (DRI) అధికారులు నిర్వహించిన సోదాల్లో మొత్తం 12 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.


దుబాయ్ నుండి భారత్‌కు వచ్చిన ఒక మహిళా ప్రయాణికురాలుపై DRI అధికారులు అనుమానం వ్యక్తం చేసి తనిఖీలు నిర్వహించారు. చెక్-ఇన్ లగేజీని పరిశీలించగా 6 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఆ మహిళకు సంబంధించిన మిస్సింగ్ లగేజీలో కూడా మరో 6 కిలోల గంజాయి బయటపడింది. ఇలా మొత్తంగా 12 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి పట్టుబడింది.


12 కోట్ల రూపాయలు!

ఈ గంజాయికి అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు 12 కోట్లు విలువ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మహిళా ప్రయాణికురాలిని 1985, NDPS చట్టం కింద అరెస్ట్ చేసిన పోలీసులు, మత్తుపదార్థాల అక్రమ రవాణాకు సంబంధించి కేసు నమోదు చేశారు.


Also Read:

మోదీ బలహీన ప్రధాని.. హెచ్-1బి వీసాలపై యూఎస్ నిర్ణయంపై రాహుల్ విమర్శ

H1B Visa Fee Hike : హెచ్‌-1బీ వీసాల రుసుము పెంపు భారత్‌కు లాభం, అమెరికాకు నష్టం!

For More Latest News

Updated Date - Sep 20 , 2025 | 03:39 PM