Share News

Navi Mumbai Airport: 8వ తేదీ నుంచి నవీ ముంబై ఎయిర్‌పోర్ట్ సేవలు, ఇక.. లండన్, న్యూయార్క్, టోక్యోల సరసన ముంబై

ABN , Publish Date - Oct 05 , 2025 | 11:51 AM

భారత విమానయాన రంగంలో మరో కీలక మలుపు. ప్రధాని మోదీ అక్టోబర్ 8, 2025న నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించబోతున్నారు. దీంతో ముంబై.. లండన్, న్యూయార్క్, టోక్యోలతో జతచేరుతుంది.

Navi Mumbai Airport:  8వ తేదీ నుంచి నవీ ముంబై ఎయిర్‌పోర్ట్ సేవలు, ఇక.. లండన్, న్యూయార్క్,  టోక్యోల సరసన ముంబై
Navi Mumbai Airport

ముంబై (మహారాష్ట్ర) అక్టోబర్ 5 : భారత విమానయాన రంగంలో మరో కీలక మలుపు. ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 8, 2025న నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని(NMIA) ప్రారంభించబోతున్నారు. ఈ విమానాశ్రయం ముంబైని.. లండన్, న్యూయార్క్, టోక్యోలతో పాటు ప్రపంచంలోని ఉన్నతమైన జంట-విమానాశ్రయ నగరాల్లో ఒకటిగా నిలుపబోతోంది.

Navi-Mumbai-Airport-1.jpg


ఈ సరికొత్త నవీ ముంబై ఎయిర్ పోర్ట్ భారతదేశాన్ని ప్రపంచ విమానయాన స్థాయికి తీసుకెళ్తుందని భావిస్తున్నారు. 1,160 హెక్టార్లలో విస్తరించి ఉన్న NMIAను అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ (74%) , CIDCO (26%) మేర ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో అభివృద్ధి చేశారు. దీని కమలం-ఆకృత డిజైన్ భారతీయ వారసత్వాన్ని అత్యాధునిక, స్థిరమైన ఇంజనీరింగ్‌తో మిళితం చేస్తుంది.

Navi-Mumbai-Airport-2.jpg


అంతేకాదు, ఇది ఆసియాలోని అత్యంత అధునాతన విమానాశ్రయాలలో ఒకటిగా నిలువబోతోంది. మొదటి దశలో ఒక రన్‌వే, టెర్మినల్‌తో ఏటా 20 మిలియన్ల మంది ప్రయాణికులకు ఈ ఎయిర్ పోర్ట్ సేవలందించనుంది. NMIA నాలుగు టెర్మినల్స్, రెండు రన్‌వేలు అందుబాటులోకి వస్తే ఇది పూర్తి సామర్థ్యంతో ముందుకు వెళ్తుంది. అప్పుడు సంవత్సరానికి 155 మిలియన్ల ప్రయాణికులకు సేవలందించే స్థాయి వెళ్తుంది.

Navi-Mumbai-Airport-3.jpg


అంతేనా.. ఈ విమానాశ్రయం ఒక భారత ప్రధాన కార్గో హబ్‌గా కూడా మారబోతోంది. ఇది ఏటా 0.5 మిలియన్ల నుండి 3.2 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేస్తుంది. దీనికి పూర్తిగా ఆటోమేటెడ్, AI- ఎనేబుల్డ్ టెర్మినల్ సహకరిస్తుంది. పునరుత్పాదక శక్తి, వర్షపు నీటి సంరక్షణ, కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ వంటి ఎన్నో విశిష్ట లక్షణాలతో ఈ విమానాశ్రయం రూపొందించారు. ఇది.. లాజిస్టిక్స్, IT, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్‌రంగంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. DGCA అక్టోబర్ 1న ఈ ఎయిర్ పోర్ట్ కు ఏరోడ్రోమ్ లైసెన్స్‌ను మంజూరు చేసింది.

Navi-Mumbai-Airport-3.jpg


ఈ వార్తలు కూడా చదవండి...

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం

వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 05 , 2025 | 12:23 PM