Home » Afghanistan
అఫ్ఘానిస్థాన్‌తో ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌లో ఉంటున్న అఫ్ఘానిస్థానీలు అందరూ దేశాన్ని వీడాల్సిందేనని స్పష్టం చేశారు. ఆత్మగౌరవం ఉన్న వారు ఇతర దేశాలు భూభాగాలు, వనరులపై ఆధారపడరని అన్నారు.
పాకిస్థాన్ వైమానిక దాడుల్లో ముగ్గురు క్రికెటర్లు చనిపోవడంపై ఆఫ్గన్ క్రికెట్ కెప్టెన్ రషీద్ ఖాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక పాక్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాక్ చర్యను పూర్తిగా అనైతికంగా, అమానుషంగా ఆయన పేర్కొన్నారు.
పాక్ దాడుల్లో ముగ్గురు క్రికెటర్లు మరణించడంతో అప్ఘాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పాక్, శ్రీలంకతో జరగాల్సిన ట్రైసిరీస్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది.
కాబూల్‌లోని టీటీపీ స్థావరాలపై పాక్ ఆర్మీ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. దీంతో ఆప్ఘనిస్తాన్ దళాలు విజృంభించాయి. సరిహద్దుల వెంబడి ఉన్న పాకిస్తాన్ మిలటరీ పోస్టులపై దాడులు చేయటం మొదలెట్టాయి.
కొద్ది రోజులుగా సరిహద్దు ఘర్షణలతో అట్టుడికిన పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ 48 గంటల పాటు కాల్పుల విరమణకు అంగీకరించాయి. తాలిబన్ల వినతి మేరకు కాల్పుల విరమణకు అంగీకరించినట్టు పాక్ సైన్యం ప్రకటించింది. పాక్ విన్నపం మేరకే తాము కాల్పుల విరమణకు ఓకే అన్నామని తాలిబన్లు ప్రకటించారు.
కాందహార్ ప్రావిన్స్‌లోని పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్థాన్ దళాలు జరిపిన వైమానిక దాడుల్లో 12 మందికి పైగా ఆఫ్ఘన్ పౌరులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇది ఇరు దేశాల మధ్య..
అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. సరిహద్దు ప్రాంతాలు కాల్పులతో దద్దరిల్లుతున్నాయి. పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించినట్లు అఫ్గాన్ అధికారులు ధృవీకరించారు. పాక్ దాడికి దీటుగా తమ సైన్యం కూడా ప్రతిఘటిస్తోందని అఫ్గాన్ స్పష్టం చేసింది.
దాదాపు వారంపాటు భారత్‌లో పర్యటించేందుకు ఆఫ్ఘాన్ మంత్రి ముత్తకీ వచ్చారు. అయితే, అక్టోబర్ 10న ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళా జర్నలిస్టులకు పిలుపు అందకపోవడం విమర్శలకు దారి తీసింది.
అఫ్గానిస్థాన్ మంత్రి ముత్తకీ పాల్గొన్న ఢిల్లీ ప్రెస్‌మీట్‌లో మహిళా జర్నలిస్టులు లేకపోవడం వివాదాస్పదంగా మారింది. అయితే, పరిమిత సంఖ్యలో ఆహ్వానాలు జారీ చేయడంతో కొందరికి పాస్‌లు అందలేదని తాలిబాన్లు తాజాగా వివరణ ఇచ్చారు.
అప్ఘాన్ మంత్రి ప్రెస్ నిర్వహణలో తమ పాత్ర లేదని భారత విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. ప్రెస్ మీట్‌లో మహిళా జర్నలిస్టులు లేకపోవడంపై విమర్శలు తలెత్తిన నేపథ్యంలో విదేశాంగ శాఖ ఈ ప్రకటన చేసింది.