Home » Adilabad
వేలాల గ్రామంలో గట్టు మల్లన్న గుట్టమీద సోమవారం చిలుకూరి బాలాజీ శివాలయం ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మరాం మహారాజ్ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు.
కాంట్రాక్టర్ల ధనదాహానికి కొండలు కరిగిపోతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకపోయినా అక్రమంగా గుట్టను తవ్వి మట్టిని తరలించుకుపోతున్నా అడిగేవారు లేరు. కాంట్రాక్టర్లకు రాజకీయ నాయకుల మద్దతు ఉండడంతో మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు.
పాత మంచిర్యాలలో శాలివాహన పవర్ ప్లాంటును మూసివేసి ఆ భూమిని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని ప్లాంటులో పని చేస్తున్న కార్మికులు ఆదివారం గేటు ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
ఉపాధ్యాయులు ఎదుర్కొం టున్న సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని పీఆర్‌టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం దామో దర్ రెడ్డి అన్నారు. సీసీసీలోని ఎంఎం గార్డెన్‌లో ఆదివారం పీఆర్‌టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు కొట్టె శంకర్ అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరి గింది.
దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి కీర్తి రాజ్‌వీరు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులోని స్వామి వివేకానంద విగ్రహా నికి పూలమాలలువేసి నివాళులర్పిం చారు.
సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటుకు 2024 సంవ త్సరానికి సేప్టీ ఎక్సలెన్స్-పవర్ థర్మల్ సెక్టర్ విభాగంలో 1వ గ్రీన్ ఎన్విరో సేఫ్టీ అవా ర్డు, గోల్డ్ అవార్డు లభించినట్లు ఎస్టీపీపీ ఈడీ రాజశేఖర్‌రావు ఆదివారం పేర్కొన్నారు.
మానవ వ్యర్థాలతో ఎరువును తయారు చేసే ప్రక్రియకు ఆది నుంచి ఆటంకాలు ఎదురవుతున్నాయి. 2021లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎఫ్‌ఎస్‌టీపీ (ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్)లను నెలకొల్పేందుకు స్థలాలు కేటాయించాలని మున్సిపాలిటీలకు ఆదేశాలు జారీ చేసింది. సుమారు ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఆ దిశగా కార్యాచరణ జరుగకపోగా, స్థలాల ఎంపిక కొలిక్కి రాలేదు.
జిల్లాలో మాతా శిశు మరణాల నియంత్రణకు అర్మాన్ సంస్థ ద్వారా ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నట్లు డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని 230 మంది ఆరోగ్య కార్యకర్తలకు అర్మాన్ సంస్థ ఇస్తున్న శిక్షణను ప్రారంభించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ పార్టీ ప్రాణహిత, కుప్తి, మందాకిని ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని వామపక్ష ప్రజా సంఘాల నాయకులు పేర్కొ న్నారు. శుక్రవారం మంచిర్యాలలో వారు మాట్లాడుతూ ఎన్నికల ముం దు సీఎం రేవంత్‌రెడ్డి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పి మర్చిపోయారన్నారు.
ఆది వాసీ కుటుంబాల సంక్షేమమే పోలీసుల ధ్యేయ మని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. శుక్రవారం మాదారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని నర్సాపూర్ (బెజ్జాల) గ్రామంలో తాండూర్ సర్కిల్ పోలీసులు, రెడ్‌క్రాస్ సొసైటీ సహకా రంతో కమ్యూనిటీ కాంటాక్టు కార్యక్రమంలో భాగంగా పోలీసులు మీ కోసం కార్యక్రమం నిర్వహించారు.