Share News

కమ్యూనిస్టుల రాజ్యాధికారంతోనే దేశాభివృద్ధి

ABN , Publish Date - Jan 17 , 2025 | 11:10 PM

కమ్యూనిస్టులు రాజ్యాధికారం చేపట్టినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి అన్నారు. ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు సంగారెడ్డిలో జరిగే రాష్ట్ర 4వ మహాసభల పోస్టర్‌ను శ్రీరాంపూర్‌లోని పార్టీ కార్యాల యంలో విడుదల చేశారు.

కమ్యూనిస్టుల రాజ్యాధికారంతోనే దేశాభివృద్ధి

శ్రీరాంపూర్‌, జనవరి 17(ఆంధ్రజ్యోతి): కమ్యూనిస్టులు రాజ్యాధికారం చేపట్టినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి అన్నారు. ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు సంగారెడ్డిలో జరిగే రాష్ట్ర 4వ మహాసభల పోస్టర్‌ను శ్రీరాంపూర్‌లోని పార్టీ కార్యాల యంలో విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం మరింత బీదరికంగా మారిం దని ఆరోపించారు. నిరుద్యోగం, అత్యాచారాలు, హత్యలు, గంజాయి, దోపిడీ, మోసాలు పెరిగి పోయాయన్నారు. గిట్టుబాటు ధర లేక రైతు లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. వైద్యం, విద్య వ్యాపారంగా మారిందన్నారు. కమ్యూనిస్టు పార్టీలకు అధికారం ఇస్తే అభివృద్ధి సాధ్య మవుతుందన్నారు. మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. నాయకులు బోడెంకి చందు, దుంపల రంజిత్‌ కుమార్‌, దూలం శ్రీనివాస్‌, బోండ్ల సరిత, కాసిపేట రాజేశం, సతీష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2025 | 11:10 PM